Begin typing your search above and press return to search.

హీరో గారి కోట‌రీని ఛేధిస్తేనే ఛాన్స్‌!

By:  Tupaki Desk   |   1 Aug 2019 1:30 AM GMT
హీరో గారి కోట‌రీని ఛేధిస్తేనే ఛాన్స్‌!
X
హీరోకి క‌థ చెప్పాలంటే ఎలా వెళ్లాలి? ఎవ‌రిని క‌ల‌వాలి? ఇలాంటి సందేహాలెన్నో ఉంటాయి. యువ‌ర‌చ‌యిత‌లు.. కొత్త ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఇదో స‌మ‌స్య‌. అయితే అలాంటి వాళ్లంతా ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ నేరుగా హీరో ద‌గ్గ‌రికే వెళ్లిపోవ‌డం కుద‌ర‌దు. ప్ర‌స్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోలెవ‌రూ ఇలాంటి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. ముందుగా త‌మ చుట్టూ ఉన్న ఓ కోట‌రీని మెప్పిస్తేనే త‌ర్వాతి రౌండ్ లో ఛాన్స్ ఉంటుంది. త‌మ దాకా రావాలంటే టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. పీఏలు.. మేనేజ‌ర్లతో అబ్బో ఆ తంతే వేరు!! ఈ త‌ర‌హా ఇప్పుడే కాదు. టాలీవుడ్ అగ్ర హీరోలంతా అనుస‌రించేదే. ప్ర‌స్తుతం ఉన్న డ‌జ‌ను టాప్ స్టార్లు ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన రైజింగ్ స్టార్లంతా ఈ త‌ర‌హానే.

ఇప్ప‌టికిప్పుడు రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను క‌లిసి క‌థ చెప్పాలంటే వెంట‌నే ప‌ర్మిష‌న్ వ‌స్తుందా? అంటే క‌ష్ట‌మే. హీరోకు క‌థ చెప్పాలంటే ముందు త‌న చుట్టూ ఉన్న కోట‌రీకి క‌థ చెప్పి మెప్పించాలి. వీళ్ల‌తో ఫ‌స్ట్ సిట్టింగ్ ముగిశాక న‌చ్చితే హీరో వ‌ర‌కూ వెళ్లే ఛాన్సొస్తుంది. వీళ్ల‌కు న‌చ్చ‌క‌పోతే వెన‌క్కి వెళ్లాల్సిందే. అయితే ఇలా ఎందుకు అంత‌మంది పీఏల్ని మేనేజ‌ర్ల‌ను పెట్టుకుంటారు? అంటే దానికి కార‌ణం లేక‌పోలేదు. ప్ర‌స్తుతం త‌ను ఉన్న బిజీ షెడ్యూల్స్ లో క‌థ‌లు వినే స‌న్నివేశం లేనేలేదు. క్ష‌ణం తీరిక లేకుండా సెట్స్ కి ప‌రుగులు పెడుతున్నాడు. ఇలా సినిమా అవ్వ‌గానే అలా వేరొక‌టి రెడీ. దీంతో అత‌డు త‌న చుట్టూ ఓ టీమ్ ని రెడీ చేసుకున్నారు. వాళ్లు విన్న త‌ర్వాత‌నే తాను వినే ప‌రిస్థితి ఉంది. ఈ త‌ర‌హా గీతా ఆర్ట్స్ స‌హా ప‌లు అగ్ర బ్యాన‌ర్ల‌లో ఉంటుంది. అక్క‌డ హీరోల వ‌ద్ద‌కు క‌థ‌లు వెళ్లాలంటే ముందు మేనేజ‌ర్లు.. పీఏలు వినాల్సి ఉంటుంది. వాళ్లు ఫిల్ట‌ర్ చేశాకే ఏ క‌థ‌కు అయినా మోక్షం ద‌క్కుతుంది.

ఇక్క‌డో ఆస‌క్తిక‌ర విష‌యం ఏమంటే... క‌థ‌ల్ని ఫిల్ట‌ర్ చేసే చోట ఒక్కోసారి మంచి క‌థ‌లు కూడా చేజారే ప‌రిస్థితి ఉంటుంది. అలా మిస్స‌యితే ఆ త‌ర్వాత ఆ హీరో కొంత న‌ష్ట‌పోయిన‌ట్టే. అలా జ‌ర‌గ‌కుండా ప‌క‌డ్భందీగా నిజాయితీ ప‌రులైన వారిని.. ఆశ్రిత ప‌క్ష‌పాతం లేని వారిని స‌ద‌రు హీరోలు కోట‌రీగా నియ‌మించుకుంటున్నారా? అన్న‌ది కీల‌కంగా మారింది. స‌రైన‌ స్క్రిప్ట్ ఏది? స‌రైన రైట‌ర్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అన్న‌ది క‌నిపెట్టే అర్హ‌త వీళ్ల‌కు ఉందా లేదా? అన్న‌ది చూడ‌డం.. జాగ్ర‌త్త ప‌డ‌డం చాలా చాలా ఇంపార్టెంట్.