Begin typing your search above and press return to search.
విశ్వక్ పై రౌడీ పంచ్ పడిందా..??
By: Tupaki Desk | 27 July 2019 4:20 AM GMTవిజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు ఎక్కువగానే ఉంది. 'డియర్ కామ్రేడ్' రిలీజ్ పట్ల అందరిలో నెలకొన్న ఆసక్తి చూస్తేనే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విజయ్ కి ఎక్కువే. అయితే కొద్ది రోజుల క్రితం విజయ్ పై హీరో కం డైరెక్టర్ విశ్వక్ సేన్ ఇన్ డైరెక్ట్ గా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రౌడీ ఫ్యాన్స్ ఆ సమయంలో విశ్వక్ పై విరుచుకుపడ్డారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఆ వివాదంపై స్పందించనేలేదు.
తాజాగా 'డియర్ కామ్రేడ్' ప్రమోషన్స్ సందర్భంగా "కొంతమంది మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు కదా.. వారి గురించి ఏమంటారు?" అని అడిగితే "ఎవరైనా సరే వాళ్ళ పట్ల వాళ్ళు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించాలి. నిజాయితీగా పనిచేయాలి. నాలాగా మాట్లాడి.. నాలాగా డ్రెసింగ్ చేసుకుంటే విజయ్ దేవరకొండ కాలేరు." అన్నాడు. తను స్క్రీన్ పైన ఎలా కనిపిస్తాను.. తనను తాను ఎలా ప్రెజెంట్ చేస్తుకుంటాను అనే విషయం అందరూ గమనిస్తారు కానీ దాని వెనక తన ప్రిపరేషన్.. ఎంత ఆత్మపరిశీలన చేసుకుంటాను అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు అన్నాడు.
అయితే ఈ వ్యాఖ్యలు విశ్వక్ కు వేసిన పంచ్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉంటే కొందరు మాత్రం.. అడిగిన ప్రశ్నకు జనరల్ గా సమాధానం చెప్పాడని.. అదేమీ విశ్వక్ ను ఉద్దేశించి పంచ్ వేయడం కాదని రౌడీహీరోను వెనకేసుకొస్తున్నారు. పంచ్ వేశాడో లేదో కానీ విజయ్ చెప్పిన మాటల్లో మాత్రం వాస్తవం ఉంది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే. కాపీ చేస్తే ఆ ఒరిజినాలిటీ రాదు. దానికంటే మనం ఎలా ఉంటామో అలా ఉంటేనే ప్రేక్షకుల మెప్పు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.