Begin typing your search above and press return to search.
స్పీచ్ తోనే ఫ్యాన్స్ ని ఖాతాలో వేశాడు!
By: Tupaki Desk | 2 May 2019 4:55 AM GMTటాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోల్లో దేవర కొండ స్టైలే వేరు. మాస్ మహారాజా రవితేజ.. నేచురల్ స్టార్ నాని.. వెర్సటైల్ స్టార్ శర్వానంద్.. ఎనర్జిటిక్ హీరో నిఖిల్ తరహాలో స్వయంకృషితో ఎదిగిన హీరోగా ఇటీవల దేవరకొండ పాపులరయ్యారు. అర్జున్ రెడ్డి- గీత గోవిందం దేవరకొండ ఇమేజ్ ని అమాంతం స్కైలోకి లేపాయి. అయితే సక్సెస్ వస్తే సరిపోయిందా.. దానిని నిలబెట్టుకుని తనని తాను స్టారాధిస్టార్ గా ఎలివేట్ చేసుకునే చొరవ.. తెలివితేటలు ఉండేది కొందరికే. ఈ విషయంలో రౌడీ కొండ అలియాస్ దేవరకొండ స్ట్రాటజీ ప్రతిసారీ చర్చకొస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ తనని తాను ప్రమోట్ చేసుకునే తీరు ఇంప్రెస్సివ్. అతడి శైలి బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో `గల్లీబోయ్` రణవీర్ సింగ్ ని పోలి ఉంటుంది. అంత వైబ్రేంట్ స్టైల్ టాలీవుడ్ లో దేవరకొండకు మాత్రమే ఉందనడంలో సందేహమే లేదు. ఇంపార్టెంట్ ప్రచార వేదికలపై అతడు కనిపించే స్టైలే వేరు. వెరైటీ స్టైలింగ్.. అలాగే స్పీచ్ లలో నేటివిటీ యాసతో దేవరకొండ ఫ్యాన్స్ లోకి మరింతగా దూసుకెళుతుంటారు. అంతేకాదు సందర్భం ఏదైనా కలిసొస్తే చాలు దానిని తెలివిగా తన మైలేజ్ ని పెంచుకునేందుకు ఉపయోగించేయడంలో దేవరకొండ కింగ్ అనే చెప్పాలి.
నిన్నటి సాయంత్రం మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ మరోసారి దేవరకొండ తానేంటో చూపించాడు. ఏ ఇతర హీరోతో పోల్చినా.. దేవరకొండ యూనిక్!! అని ఈ వేదిక మరోసారి ప్రూవ్ చేసింది. ఈ వేదికపై మహేష్ ఫ్యాన్స్ ని తనదైన స్పీచ్ తో గంపగుత్తగా క్లీన్ స్వీప్ చేశాడు రౌడీ. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ``నేను ఇంటర్ నుండి మహేష్ కి పెద్ద ఫ్యాన్ ని. అందుకే ఆయన్ని సార్! అని పిలవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. మేం కాలేజ్ లో ఉన్నప్పుడు మావాడు అని అనుకుంటుండే. ఆయన 25వ సినిమా. ఇదొక జర్నీ. జర్నీ ఆఫ్ రిషి.. జర్నీ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక్కొక్క జర్నీకి ఒక్కొక్క సూపర్ స్టార్ ఉండేవాళ్లు. ఓ జనరేషన్ కి చిరు సార్ ఉండేవాళ్లు. ఎప్పటికీ మహేష్ గారు ఆ స్థాయిలో ఉన్నారు`` అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు. తాను మహేష్ మూవీ కోసం టిక్కెట్ క్యూలో నిలబడి ఎన్ని తంటాలు పడేవాడో కూడా దేవరకొండ మహేష్ ఫ్యాన్స్ కి చెప్పారు.
మహేష్ ని చూసి లైఫ్ ఇలా ఉండాలని అనుకున్నా. హీరోను అయ్యానని దేవరకొండ ఈ వేదికపై చెప్పడం ఆసక్తి రేకెత్తించింది. ``కోణార్క్ లో మహేష్ సినిమాలు చూడాలనుకునేవాడిని. కానీ మాస్ కారణంగా టిక్కెట్స్ దొరికేవీ కావు. చివరకు ఆడాళ్ల క్యూ తక్కువగా ఉంటుందని తెలుసుకుని సినిమా రిలీజ్ సమయంలో నా కజిన్స్ లో లేడీస్ ని.. ఫ్రెండ్సుని పట్టుకుని టికెట్స్ తెప్పించుకునేవాడిని`` అని తెలిపారు. మహేష్ వెళ్లిన ఓ అవార్డ్ ఫంక్షన్ కి నటుడిగా వెళ్లినప్పుడు... అక్కడకు మహేష్ గారు రాగానే ఆయన్ను అందరూ విష్ చేయడం చూసి అరె! లైఫ్ అంటే అలా ఉండ్రాలా!! అనుకున్నానని... ఆ తర్వాత నేను పెళ్ళిచూపులు - అర్జున్ రెడ్డి సినిమాలు చేశానని దేవరకొండ తెలిపారు. వాటిని చూసి మహేష్ గారు ట్వీట్ చేసేవారు. నా ఫోన్ లో ట్విట్టర్ వాట్సాప్ ఉండవు కానీ. ఎవరో చెబితే వెళ్లి వెతుక్కునేవాడిని. నా గురించి ఆయన ఏదైనా గొప్పగా చెబితే సంతోషంగా అనిపించేది. ఆయన్ని గర్వంగా ఉంచడానికి వరుసగా సినిమాలు చేస్తాను. నా గురించి ట్వీట్స్ చేసేలా చూసుకుంటాను`` అంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు దేవరకొండ. నా పుట్టిన రోజున వస్తున్న మహర్షి నాపై ఒత్తిడి పెంచుతోంది. సూపర్ హిట్ అవ్వాలని ఒక అభిమానిగా వేచి చూస్తున్నా.. అంటూ ఫ్యాన్స్ ని హుషారెత్తించాడు దేవరకొండ. అసలు దేవరకొండ ఎందుకు హృదయాల్ని హత్తుకునే రౌడీకొండా అయ్యాడో ఈ స్పీచ్ అర్థమయ్యేలా చెప్పిందంతే!!