Begin typing your search above and press return to search.
నిక్కరేసి కండలు మెలి తిప్పి రౌడీ హల్ చల్
By: Tupaki Desk | 6 Feb 2020 9:30 AM GMTహీరో అన్నాక యాటిట్యూడ్ చూపించాలి. అసలు హీరోయిజం అన్నదే ఒక యాటిట్యూడ్. అది లేకపోతే ఏదీ లేనట్టే. అయితే ఆ యాటిట్యూడ్ ని ఎక్కడ ఎంత చూపించాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలి? అన్నది విజయ్ దేవరకొండను చూసి నేర్చుకోవాల్సిందే. ఫ్యాన్స్ కి ఏం నచ్చుతుందో గ్రహించి అది చేయడం .. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ పరంగా నేటి తరానికి ఏది నచ్చుతుందో అలా కనిపించడం.. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వు పులుముకుని కనిపించడం .. వేదికలు ఎక్కితే వైబ్రేంట్ గా తనదైన స్టైల్లో చెణుకులతో ఫ్యాన్స్ ని గగ్గోలు పెట్టించడం.. ఇవన్నీ రౌడీ దేవరకొండ యాటిట్యూడ్ కి సంబంధించిన సంగతులు. ఇవన్నీ పాజిటివ్ కోణాలే.
ఇక ఇటీవలి కాలంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ని ఫాలో చేయడంలో దేవరకొండ మరీ టూమచ్ గా ఇన్వాల్వ్ అయిపోతుండడమే అభిమానులకు ఒక్కోసారి నచ్చడం లేదు. ఉత్తరాది ఫ్యాన్స్ తో పోల్చి చూస్తే.. దక్షిణాది అభిమానుల సెన్సిబిలిటీస్ కాస్తంత డిఫరెంట్. అందుకు తగ్గట్టే ఫ్యాషన్స్ ని యాటిట్యూడ్ ని చూపించాల్సి ఉంటుంది. మరీ ఇలా నిక్కరేసుకుని విమానాశ్రయాల్లో అరిపించేస్తే కుదరదు. కొన్నిసార్లు విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అసలే షో మ్యాన్ లా కండలు పెంచాడు. బైసెప్ పెంచి ట్రై సెప్ మెలి తిప్పేస్తున్నాడు. 6 ప్యాక్ యాబ్స్ ట్రై చేస్తున్నాడు. వీటికి తోడు పొడవాటి గిరజాల్ని పెంచుతున్నాడు. ఇంకా చెప్పాలంటే లుక్ పరంగా ఎవరూ ఊహించని ఓ కొత్త ఛేంజోవర్ రౌడీ కొండలో కనిపిస్తోంది. ఈ మార్పు అంతా ఫైటర్ సినిమా కోసమే. ఇప్పటికే ఎందరో స్టార్లను లుక్ పరంగా మార్చేసిన పూరి జగన్నాథ్.. ఈసారి పూర్తిగా దేవరకొండపై శ్రద్ధ కనబరిచాడు. అతడిని ఎవరూ ఊహించనంత కొత్తగా మలిచేస్తున్నాడు. ఆ సంగతి విమనాశ్రయాల్లో అతడి ఫోటో లీకులే చెప్పేస్తున్నాయి. వైట్ టీస్.. షార్ట్ వేసుకుని ఇదిగో ఇలా విమానాశ్రయం నుంచి వస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఫైటర్ మెజారిటీ పార్ట్ ముంబైలోనే తెరకెక్కనుంది కాబట్టి హైదరాబాద్ నుంచి ముంబై కి రెగ్యులర్ గా చక్కర్లు కొడుతున్నాడు. అలా కెమెరా కంటికి దొరికిపోతున్నాడు. ఫైటర్ ని సాధ్యమైనంత తొందర్లోనే పూర్తి చేసి పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసేందుకు పూరి అన్నిరకాలా ప్రణాళికల్ని వేసిన సంగతి తెలిసిందే.