Begin typing your search above and press return to search.

లవర్ బాయ్ ఇమేజ్ కి గుడ్ బై చెప్పనున్న రౌడీ

By:  Tupaki Desk   |   6 Feb 2020 6:58 PM GMT
లవర్ బాయ్ ఇమేజ్ కి గుడ్ బై చెప్పనున్న రౌడీ
X
పెళ్లి చూపులు' అనే సాఫ్ట్ లవ్ స్టోరీతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ అప్పటి నుండి ఇప్పటి వరకూ చేసినవన్నీ లవ్ స్టోరీసే.. మధ్యలో 'నోటా' అనే పొలిటికల్ డ్రామా మినహా అన్ని సినిమాలు ప్రేమ కథాంశంతో తెరకెక్కినవే. ఇలా బ్యాక్ టూ బ్యాక్ లవ్ స్టోరీస్ తో యూత్ లో లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న విజయ్ ఇప్పుడా ఇమేజ్ ను పక్కన పెట్టి కొత్త ఇమేజ్ తెచ్చుకునే పనిలో పడ్డాడు.

అవును ఇకపై లవ్ స్టోరీస్ కి ఫులిస్టాప్ పెట్టనున్నాడు రౌడీ. ఈ విషయాన్ని 'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పబ్లిక్ గా చెప్పాడు. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ ఇకపై నా రూటే సెపరేట్ అంటూ చెప్పుకున్నాడు. ఫిబ్రవరి 14 న వరల్డ్ ఫేమస్ లవర్ తో వస్తున్న విజయ్ ప్రస్తుతం పూరితో ఓ పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ , డైలాగ్స్ ఇలా అన్నీ మాస్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసేలా ఉంటాయట. ఒక్క ముక్కలో చెప్పాలంటే పూరి సినిమాతో సరికొత్త విజయ్ ను చూడబోతున్నారు ప్రేక్షకులు.

అందుకే పూరి మాయలో పడిన రౌడీ ఇకపై లవ్ స్టోరీస్ ను పక్కన పెట్టి మాస్ కథలతో ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మధ్యలో ఒకటి రెండూ ఏదైనా ఎమోషనల్ సినిమాలు మాత్రమే చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సో ఇకపై ఓన్లీ లవ్ స్టోరీతో రౌడీని కలిస్తే జస్ట్ ఇమిడియట్లీ నో అనేస్తాడన్నమాట విజయ్. మరి విజయ్ చెప్పిన మాట మీదే నిలబడి సినిమాలు చేస్తాడా లేదా ఎవరైనా ఎట్రాక్ట్ చేసే లవ్ స్టోరీతో వస్తే తన డిసిషన్ మార్చుకుంటాడా వేచి చూడాలి.