Begin typing your search above and press return to search.

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ డేట్ వచ్చిందోచ్!

By:  Tupaki Desk   |   2 Jan 2020 12:26 PM GMT
వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ డేట్ వచ్చిందోచ్!
X
యువహీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేస్తామని ఇప్పటికే ఫిలింమేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు.

రేపు అంటే.. శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర బృందం కాసేపటి క్రితం వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ ఒక అమ్మాయిని గట్టిగా హత్తుకుని కన్నీరు పెడుతున్నాడు.. అమ్మాయి అటువైపు తిరిగి ఉండడంతో ఎవరో తెలియడం లేదు కానీ అమ్మాయిలో నలుగురు హీరోయిన్లతో సరదాగా గడుపుతున్న విజయ్ దేవరకొండ ఫోటోలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఇంటెన్సిటీ.. ఆ గెటప్ చూస్తుంటే 'అర్జున్ రెడ్డి' లుక్ గుర్తొస్తోంది. విజయ్ లాస్ట్ సినిమా 'డియర్ కామ్రేడ్' లో కూడా ఇలానే 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనిపించాయి. మరి ఈ సినిమాలో కూడా అదే ఫ్లేవర్ ఉంటుందా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.

ఈ సినిమాలో రాశి ఖన్నా.. కేథరిన్ ట్రెసా.. ఐశ్వర్య రాజేష్.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎ వల్లభ నిర్మిస్తున్నారు. కె యస్ రామారావు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.