Begin typing your search above and press return to search.
ఫేమస్ లవర్ ..ఫాంటసీలో తప్పు దొర్లదు కదా!
By: Tupaki Desk | 29 Jan 2020 2:30 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో `వరల్డ్ ఫేమస్ లవర్` రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో క్రాంతి మాధవ్ బిజీగా ఉన్నారట. ఇప్పటికే ప్రచారంలో చిత్రబృందం స్పీడ్ పెంచింది. ఇటీవల రిలీజైన టైటిల్.. పోస్టర్స్.. టీజర్ ను బట్టి ఓ భగ్న ప్రేమికుడిగా విజయ్ కనిపించబోతున్నారని అర్థమవుతోంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో దేవరకొండ కనిపించనున్నాడు. రివీల్ చేసిన నాలుగు గెటప్పుల్లో అర్జున్ రెడ్డి తరహా లుక్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది.
ఈ సినిమా విజయ్ కే కాదు.. క్రాంతి మాధవ్ కి చాలా ఇంపార్టెంట్. కొన్ని వరుస ఫెయిల్యూర్స్ తర్వాత గ్యారెంటీ హిట్ కోసం క్రాంతి మాధవ్ చాలానే శ్రమిస్తున్నారు. రౌడీ స్టార్ కు ఉన్న లవర్ బోయ్ ఇమేజ్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందా? అన్నది చూడాలి. ఈ సినిమాలో విజయ్ పాత్ర గురించిన లీకులు ఆసక్తిని రేకెత్తించాయి. ఒక స్టోరీ రైటర్ తాను రాసుకునే కథల్లో తానే హీరోగా ఊహించుకుంటాడు. ప్రతి కథలో నాయికలు మారుతుంటారు. అంటే ఇదో తరహా ఫాంటసీ లవ్ స్టోరి అని చెప్పొచ్చు.
టీజర్ లో ఇప్పటికే ప్రేమకథల తీరుతెన్నుల్ని చూపించారు. ఒకే కుర్రాడు నలుగురు యువతులతో రొమాన్స్ అనగానే ఆసక్తి పెరిగింది. అయితే ఈ తరహా స్క్రీన్ ప్లే అంటే మనకు ప్రయోగమే. ఒక రకంగా రౌడీ స్టార్ పెద్ద సాహసం చేసినట్లే. ఇలాంటి కాన్సెప్ట్ కు స్క్రీన్ ప్లే లో ఎలాంటి తప్పు దొర్లినా ఇబ్బందికరమే. కథనంలో గ్రిప్ ఎక్కడా మిస్ అవ్వకుండా కన్వే చేయగలగాలి. లేదంటే ఆడియన్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. కథ బావున్నా.. విజువల్స్ బావున్నా.. స్క్రీన్ ప్లే లోపంతో బోల్తా కొట్టిన సినిమాలెన్నో ఉన్నాయి. మరి ఆ ఒక్క తప్పు దొర్లకుండా క్రాంతి మాధవ్ ఎలాంటి జాగ్రతలు తీసుకున్నాడు అన్నది చూడాలి. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.