Begin typing your search above and press return to search.

కేర‌ళ‌కు 70ల‌క్ష‌లు డొనేట్ చేశాడే

By:  Tupaki Desk   |   22 Aug 2018 5:20 AM GMT
కేర‌ళ‌కు 70ల‌క్ష‌లు డొనేట్ చేశాడే
X
కేర‌ళను వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌ట్లో న‌ష్ట‌నివార‌ణ అంత సులువేం కాదు. ప్ర‌కృతి ప్ర‌కోపిస్తే ఎంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుందో ఈ విపత్తు ప్ర‌భుత్వాల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పింది. ఇది జాతీయ విప‌త్తు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయి - ల‌క్ష‌లాది జ‌నం నిరాశ్ర‌యుల‌య్యారు. 250 సెం.మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. విల‌యానికి సెల‌బ్రిటీలు - ఉన్నోళ్లు - పేద‌-బీద - కులం - గోత్రం - మ‌తం అనే తేడా ఉండ‌ద‌ని కూడా ప్రూవ్ చేసింది. ఎన్నో సినిమాలు వాయిదాలు వేసుకోవాల్సొచ్చింది.

ఇలాంటి ప‌రిస్థితిలో ఇరుగుపొరుగు స్పంద‌న అద్భుతం. కేవ‌లం సినీప‌రిశ్ర‌మ‌ల నుంచే కోట్ల‌లో సొమ్ములు కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి చేరుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ 30-40 మంది టాప్ హీరోలు - సెల‌బ్రిటీలు ల‌క్ష‌ల్లో విరాళాలు ప్ర‌క‌టించి మంచి మ‌న‌సు చాటుకున్నారు. ఇందులో టాలీవుడ్ అగ్ర‌హీరోలంతా ఉన్నారు. కేవ‌లం మెగా ఫ్యామిలీ నుంచే కోటి వ‌ర‌కూ కేర‌ళ రిలీఫ్ ఫండ్‌ కి చేర‌నుంది. ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు డొనేష‌న్లు ప్ర‌క‌టించాయి. గీతాఆర్ట్స్‌ - మైత్రి మూవీస్ సంస్థ‌లు డొనేష‌న్లు ఇచ్చాయి.

అటు త‌మిళ‌నాడు నుంచి క‌మ‌ల్ హాస‌న్ మొద‌లు మొత్తం హీరోలంతా ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు ప్ర‌క‌టించి ధాతృత్వం చాటుకున్నారు. అయితే గ‌త రెండ్రోజులుగా ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌టించిన డొనేష‌న్‌ పై కొంత క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. అత‌డు ఒక్క‌డే ఏకంగా 14కోట్ల డొనేష‌న్ ప్ర‌క‌టించాడ‌న్న ప్ర‌చారం సాగింది. దీనికి క్లారిటీ ఇస్తూ విజ‌య్ 70ల‌క్ష‌ల డొనేష‌న్ ప్ర‌క‌టించ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కూ స్టార్ హీరోలంద‌రిలో అతిపెద్ద మొత్తాన్ని ప్ర‌క‌టించిన‌ది విజ‌య్ అనే చెప్పాలి. అటు బాలీవుడ్ నుంచి కింగ్ ఖాన్ 21ల‌క్ష‌లు ప్ర‌క‌టించాడు.