Begin typing your search above and press return to search.
రాఖీభాయ్ కి ముందే రంగంలోకి విజయ్
By: Tupaki Desk | 22 March 2022 7:30 AM GMTతమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ కి కోలీవుడ్ లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటించిన చిత్రాలు ఇటీవల వరుసగా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కలెక్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఇటీవల చేసిన 'మాస్టర్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లని రాబట్టింది. దీంతో ఆయన నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'మాస్టర్' తరువాత విజయ్ నటిస్తున్న భారీ చిత్రం 'బీస్ట్'.
నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారణ్ నిర్మించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఎట్టకేలకు చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్ట్ తో ప్రకటించారు. యు/ఏ సర్టిఫికెట్ లభించింది. తమిళంలో పాటు ఈ మూవీ తెలుగులోనూ అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఇటీవల విడుదల చేసిన రిలికల్ వీడియోలు నెట్టింట రికార్డులు సృష్టించాయి. దీంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ రిలీజ్ తరువాత రోజే కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన క్రేజీ మూవీ 'కేజీఎష్ చాప్టర్ 2' రిలీజ్ కాబోతోంది. దీంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాఖీ భాయ్ కి ముందే రంగంలోకి దిగుతున్న విజయ్ తుఫాన్ దెబ్బికి నిలడబడతాడా అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.
'కేజీఎష్ చాప్టర్ 2' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఐదు బాషల్లో భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అది విజయ్ 'బీస్ట్'కి ఇబ్బందికరంగా మారే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయి మొత్తానికి ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. మెర్సల్, మాస్టర్ చిత్రాలతో క్రమ క్రమంగా విజయ్ చిత్రాలకు మంచి మార్కెట్ క్రియేట్ అయింది.
తాజాగా అది 'బీస్ట్'కి మరింత ప్లస్ గా మారిందని, ఈ చిత్ర థియేట్రికల్ హక్కులని దాదాపు 11 కోట్లకు ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో విజయ్ నటించిన 'మాస్టర్' చిత్ర థియేట్రికల్ రైట్స్ కు 6 కోట్లు ఇచ్చారు. అయితే అది 14 కోట్లు వసూలు చేసి నిర్మాతకు లాభాల్ని తెచ్చిపెట్టింది.
దీన్ని గమనించి 'బీస్ట్'కి భారీగా డిమాండ్ చేశారట. దీంతో 11 కోట్లు థియేట్రికల్ రైట్స్ కోసం తెలుగు నిర్మాత ఆఫర్ చేసి దక్కించుకున్నాడని తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి అంచనాలున్నాయి.