Begin typing your search above and press return to search.
ఈ సూపర్ స్టార్ బర్త్ డే ప్లెక్సీ దేనికి సంకేతం?
By: Tupaki Desk | 19 Jun 2020 2:00 PM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ పుట్టిన రోజు రాబోతుంది. ఈనెల 22న భారీ ఎత్తున పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు విజయ్ అభిమానులు ఏర్పాట్లు చేశారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలు ఉత్సవాలు వద్దంటూ స్వయంగా విజయ్ ప్రకటన విడుదల చేసి మరీ చెప్పడంతో ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. ప్రతి ఏడాది మాదిరిగా కాకుండా ఈసారి కేవలం సోషల్ మీడియాలో విజయ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఫ్యాన్స్ కొందరు భావించారు. కాని మధురై లోని విజయ్ వీరాభిమానులు మాత్రం చాలా ప్రత్యేకంగా తమ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మధురై నగర వీధుల్లో గత రెండు రోజుల్లో విజయ్ బర్త్ డే కు సంబంధించిన ప్లెక్సీలు భారీ ఎత్తున వెలిశాయి. ఆ ప్లెక్సీల్లో విజయ్ మాత్రమే ఉంటే చర్చ ఉండేది కాదు. కాని విజయ్ పక్కన కమల్ హాసన్ ఆపక్కన శివాజీ గణేషన్ కూడా ఉన్నారు. విజయ్ బర్త్ డే ప్లెక్సీల్లో వారి ఫొటోలు ఎందుకు న్నాయంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మధురై అభిమానులు విజయ్ వెంటనే రాజకీయాల్లోకి రావాలంటూ కోరుకుంటూ ఆ ప్లెక్సీలు పెట్టినట్లుగా కొందరు అంటున్నారు.
ఈమద్య కాలంలో విజయ్ చేసిన సినిమాల కారణంగా రాజకీయ ప్రత్యర్థులు చాలా మంది అయ్యారు. కొన్ని రోజుల క్రితం విజయ్ పై ఐటీ రైట్స్ జరగడంతో పాటు మరికొన్ని విషయాల్లో కూడా ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేశారు అనేది టాక్. విజయ్ అభిమానులు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు విజయ్ పై కక్ష కట్టారు అనేది అభిమానుల టాక్. అందుకే విజయ్ రాజకీయాల్లోకి వచ్చి వారికి తగిన పాఠం చెప్పాలి అనేది అభిమానుల కోరిక. ఈ బర్త్ డేకు విజయ్ నుండి ఏమైనా స్పెషల్ ప్రకటన వెలువడుతుందా అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.