Begin typing your search above and press return to search.
విజయ్ ఫ్యాన్స్ అంటే ఇలాగే ఉంటారు మరి
By: Tupaki Desk | 17 Oct 2019 4:34 PM GMTతమిళ హీరోల ఫ్యాన్స్ ఏ స్థాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ హీరో చిన్న రికార్డును కూడా గిన్నీస్ రికార్డు స్థాయిలో ప్రచారం చేసుకోవడం తమిళ అభిమానులకు బాగా తెలిసిన పని. తమిళ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా కూడా తమ హీరోనే గ్రేట్ అంటూ ఎప్పటికప్పుడు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ బాలీవుడ్ హీరోలను కూడా చిన్నబుచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే విజయ్ హీరోగా నటించిన 'బిగిల్' విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'బిగిల్' చిత్రం ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంది. మొన్నటి వరకు వ్యూస్ రికార్డులను లెక్కిస్తూ వస్తున్న అభిమానులు ఇప్పుడు ఆ వీడియోలకు వచ్చే లైక్స్ రికార్డులను లెక్కించుకుంటున్నారు.
బిగిల్ చిత్రం రెండు మిలియన్ లకు మించి యూట్యూబ్ లో లైక్స్ ను దక్కించుకుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఏ సినిమా ట్రైలర్ కూడా ఈ స్థాయి లైక్స్ ను యూట్యూబ్ లో దక్కించుకోలేదని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఒక గ్రాఫ్ ను క్రియేట్ చేసి ఏ సినిమా ట్రైలర్ అత్యధికంగా లైక్స్ ను దక్కించుకుంది.. ఆ తర్వాత స్థానంలో ఏది ఉంది అంటూ చూపించారు. ఆ గ్రాఫ్ ను పరిశీలించినట్లయితే 2.02 మిలియన్ లైక్స్ తో 'బిగిల్' నెం.1 స్థానంలో ఉంది.
బిగిల్ తర్వాత స్థానంలో బాలీవుడ్ డిజాస్టర్ మూవీ 'జీరో' ఉంది. 2 మిలియన్ లైక్స్ ను జీరో మూవీ ట్రైలర్ దక్కించుకుంది. ఆ తర్వాత వార్ చిత్రం 1.65 మిలియన్ లైక్స్ ను పొందింది. నాల్గవ స్థానంలో సూపర్ 30 మరియు అయిదవ స్థానంలో థోహ్ సినిమాల ట్రైలర్ లు లైక్స్ కౌంట్ ఉంది. మొత్తానికి విజయ్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఈ గ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.