Begin typing your search above and press return to search.
పిచ్చికి పరాకాష్ట.. పాలు కాదు పెప్సీ
By: Tupaki Desk | 15 April 2016 4:02 AM GMTఏవండి సూపర్ స్టార్ రజనీకాంత్ కటౌట్ కు.. పాలతో అభిషేక్‌ం చేసి.. వేల లీటర్ల పాలు వేస్ట్ చేస్తారా? సామాన్యులు ఈ ప్రశ్నను అడిగితే ఫ్యాన్సు ఊరుకోరుగాని.. స్వయంగా మద్రాస్ హైకోర్టు ఇంటర్వీన్ అయ్యి.. పాలతో అభిషేక్ చేయడానికి బ్యాన్ చేసింది. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ పిచ్చి ఇంకా పరాకాష్టకు చేరుకుంది.
మండుటెండలో కాస్త నోరు తడుపుకుందాం అని మన కూల్ డ్రింకులు తాగుతుంటాయి. కాని పవర్ స్టార్ ఇలైదళపతి విజయ్ అభిమానులు మాత్రం.. ఇప్పుడు పెప్సీ. థమ్సప్.. కోక్.. ఫాంటా.. వగైరా డ్రింకులతో ఆయన కటౌట్లకు అభిషేకం చేస్తున్నారు. నిన్న ఉదయం ఆటతో తమిళనాటి రిలీజైన ''తెరి'' సినిమా ధియేటర్ల దగ్గర ఈ పెప్సీ అభిషేకం చూపించారు అభిమానులు. ఇక ఉదయం 8 గంటలకు ప్రదర్శించిన ఫస్టు షోకు టికెట్లను రూ. 700 వరకు బ్లాక్ లో అమ్మారట. సినిమాకు వచ్చినవాళ్లందరికీ ఉచితంగా స్టీలు గ్లాసు - ఒక లడ్డూ - మంచ్ చాక్లెట్ కూడా ఇచ్చారండోయ్.
అయినా ఎంత పిచ్చి పరాకాష్టకు చేరకపోతే ఇలా పాలు వద్దంటే పెప్సీతో అభిషేకం చేస్తారు మాష్టారూ? ఇప్పుడు వాటిని కూడా బ్యాన్ చేస్తే? మర్చిపోయాం చెపడం.. కొంతమంది బీరుతో అభిషేకం చేస్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారట. అసలు అభిషేకాలనే బ్యాన్ చేయాలేమో!!