Begin typing your search above and press return to search.
విజయ్ బీజేపీలో చేరడం లేదు: తండ్రి స్పష్టం
By: Tupaki Desk | 14 Oct 2020 10:50 AM GMTతమిళ ఇళయ దళపతి ప్రముఖ అగ్ర హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కమల్ హాసన్, రజినీకాంత్ బాటలోనే విజయ్ రాజకీయాల్లో వచ్చి అదృష్టం పరీక్షించుకుంటారని ప్రచారం సాగుతోంది.
ఇక తాజాగా విజయ్ కొత్త పార్టీ పెట్టకుండా బీజేపీలో చేరుతారన్న ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ బీజేపీ సారథిగా.. సీఎం అభ్యర్థిగా నిలబడుతారన్న ప్రచారం సాగుతోంది. ప్రముఖ నటి కుష్బూ బీజేపీలో చేరడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.
విజయ్ బీజేపీలో చేరబోతున్నాడన్న పుకార్లపై ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. తన కుమారుడు, హీరో విజయ్ బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.
విజయ్ రాజకీయాల్లోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ.. బీజేపీ సిద్ధాంతాలతో ఆయన ఏకీభవించడం లేదని తెలిపారు.
ఇక ఇప్పటికే హీరో విజయ్ తన సినిమాల్లో బీజేపీకి వ్యతిరేకంగా చూపిస్తున్నాడు. బీజేపీ పథకాలను విమర్శించారు. ఈ క్రమంలోనే విజయ్ పై ఐటీ దాడులు కూడా జరిగాయి. బీజేపీ నేతలు, క్యాడర్ ఏదో విధంగా విజయ్ దళపతిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అంతటి వ్యతిరేకించే పార్టీలో విజయ్ చేరడం కల అని అంటున్నారు.