Begin typing your search above and press return to search.
రౌడీ గారికి ఆ హడావుడి నచ్చలేదట
By: Tupaki Desk | 28 Nov 2019 5:42 AM GMT'అర్జున్ రెడ్డి' సినిమా క్లాసిక్ స్టేటస్ అందుకున్నప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఈమధ్య ఒక కార్యక్రమంలో మలయాళ నటి పార్వతి 'అర్జున్ రెడ్డి' సినిమాపై తీవ్రమైన విమర్శలే చేసింది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను వెల్లడించింది. 'అర్జున్ రెడ్డి' ప్రేమలో హింసను గొప్ప విషయంగా చూపించిందని.. పైగా చాలామంది జనాలు అది సాధారణం అన్నట్టుగా స్పందించడం సరికాదని చెప్పింది.
'జోకర్' సినిమాలో హింసను గ్లోరిఫై చెయ్యలేదు.. అదే అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్ లో హింసను అదేదో ఒక గొప్ప విషయంగా చూపించారు. దానికి తోడు చెంపదెబ్బలు కొట్టుకుంటేనే ఒక రిలేషన్ లో తీవ్రత ఉన్నట్టు లేకపోతే లేనట్టుగా చెప్పడం కూడా సరి కాదు.ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో చాలామంది నుంచి మద్దతు లభిస్తోంది.. ఇది హింసను ప్రేరేపించడమే. అంటూ తీవ్రమైన వ్యాఖలు చేసింది.
ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా చర్చలు సాగుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన విజయ్ దేవరకొండ కాస్త ఓపెన్ గానే మాట్లాడాడు. ఈ స్పందనలతో తనకు విసుగుపుడుతోందని వెల్లడించాడు. ఒక జంట ఏదో ఒక సందర్భంలో చెంప దెబ్బ కొట్టుకోవచ్చని.. అలాంటి జంటలు అర్జున్ రెడ్డి సినిమాను ఓపెన్ గా అర్థం చేసుకోగలవని అన్నాడు. అదే ఒక వ్యక్తి చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కొట్లాటలు చూస్తూ పెరిగి ఉంటే ఇదంతా హింసలాగా భయంకరంగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు.
పార్వతి వ్యాఖ్యలపై స్పందిస్తూ "నేను సాధారణంగా పక్కవారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఈ ప్రశ్నల వెనుక ఒక నిజమైన ఆందోళన ఉందని భావిస్తాను. పార్వతి అడిగిన విషయాలను నేను తప్పుగా అనుకోను. ఆమె వర్క్ నాకు నచ్చుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ అంశంపై జరుగుతున్న హడావుడి నాకు నచ్చలేదు. వారేం మాట్లాడుతున్నారో వారికి తెలియదు" అంటూ అర్జున్ రెడ్డిపై హంగామా చేస్తున్న బ్యాచ్ కు చురకలు అంటించాడు. అంతా బాగానే ఉంది కానీ కామెంట్లు చేసింది పార్వతి అయితే రౌడీ గారు నెటిజన్లకు చురకలు అంటించడం ఏంటో. ఉరుము ఉరిమి మంగళం మీద పడడం అంటే ఇదే!