Begin typing your search above and press return to search.
ఖాకీ దర్శకుడితో దళపతి విజయ్ మరో సినిమా లైన్ చేశాడా..??
By: Tupaki Desk | 21 Jan 2021 12:30 AM GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకో యంగ్ డైరెక్టర్ పేరు వార్తలలో నిలుస్తుంది. ఇళయదళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తోంది. అసలు లాక్ డౌన్ ముందు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ రాబట్టేవో ఇప్పుడు కూడా సినిమాలు అదే రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇక మాస్టర్ విజయ్ ప్రస్తుతం హిట్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే తన తదుపరి సినిమా గురించి రెడీ అవుతున్నాడు. దళపతి కెరీర్ లో 64వ సినిమాగా మాస్టర్ రూపొందగా.. 65వ సినిమా దిలీప్ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ విషయం పై ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో వాలిమై అనే సినిమా రూపొందిస్తున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్.. అయితే ఇప్పుడు వినోద్ పేరు ఎందుకొచ్చింది అనుకోవచ్చు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. వినోద్ దళపతి విజయ్ నటించనున్న 66వ సినిమాకు దర్శకత్వం వహించడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. వినోద్ ఇదివరకే కొన్నేళ్ల క్రితం విజయ్ ని కలిసి ఓ పొలిటికల్ డ్రామా స్టోరీని వినిపించాడట. కానీ ఆ సమయంలో మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేసాడు విజయ్. ఇక తమిళనాడులో రాజకీయ వాతావరణం నార్మల్ అయ్యేవరకు వెయిట్ చేస్తే బాగుంటుందని వినోత్ కు చెప్పినట్లు వినికిడి. విజయ్ ప్రస్తుతం మాస్టర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో తన 65వ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నాడు. అయితే వినోద్ ఎంతటి ప్రతిభ గల దర్శకుడో అతని సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. తెలుగులో హిట్ అయిన బ్లఫ్ మాస్టర్ ఒరిజినల్, కార్తీ నటించిన ఖాకీ, అలాగే పింక్ తమిళ రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేసాడు వినోద్. చూడాలి మరి విజయ్ తో సినిమా ఉంటే గనక ఆ సినిమాను కూడా మాస్టర్ సినిమా నిర్మాత లలిత్ కుమార్ నిర్మిస్తాడని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. చూడాలి మరి త్వరలో ఏదైనా అప్డేట్ వస్తుందేమో..!