Begin typing your search above and press return to search.
ఇళయదళపతి విజయ్.. ఎన్టీఆర్ అభిమాని
By: Tupaki Desk | 1 Oct 2017 5:55 AM GMTతమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ ఉన్న హీరో విజయ్. ఐతే అతడి కంటే తక్కువ స్థాయి హీరోలు చాలామందికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కానీ విజయ్ కి మాత్రం ఇక్కడ పెద్దగా ఫాలోయింగ్ లేదు. తుపాకి.. జిల్లా లాంటి సినిమాలతో తెలుగులో కొంచెం మార్కెట్ సంపాదించుకున్నప్పటికీ పులి.. పోలీస్ సినిమాలతో మళ్లీ కింద పడ్డాడు. ఐతే ఇప్పుడు తన కొత్త సినిమా ‘అదిరింది’తో రాత మారుతుందని ఆశిస్తున్నాడు విజయ్. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు అందించడం విశేషం. పైగా కాజల్ అగర్వాల్.. సమంత ఇందులో కథానాయికలుగా నటిస్తుండటం కూడా కలిసొచ్చే విషయమే. పవన్ మిత్రుడైన నిర్మాత శరత్ మరార్ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తుండటం మరో విశేషం. విజయదశమి కానుకగా ‘అదిరింది’ టీజర్ రిలీజ్ చేశారు.
తమిళంలో కొన్ని రోజుల కిందటే రిలీజైన టీజర్ నే తెలుగులోకి కూడా యాజిటీజ్ గా దించేశారు. టీజర్ ఆరంభంలో వచ్చే ఇంటెన్స్ డైలాగుల్ని బాగానే అనువదించారు. డైలాగ్స్ కాకుండా తెలుగులోకి వచ్చేసరికి కనిపించే ఓ ముఖ్యమైన మార్పులు.. నేటివిటీ పరంగా చేసిన మార్పులు. తమిళ టీజర్లో ఒకచోట బ్యాగ్రౌండ్లో ఎంజీఆర్ ఫొటో ఉంటుంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో హీరోను ఎంజీఆర్ గా చూపిస్తారట. తెలుగులో ఎంజీఆర్ బదులు ఎన్టీఆర్ అభిమానిగా చూపించబోతున్నారు. టీజర్లో ఎంజీఆర్ కటౌట్ కనిపించే చోటే ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ కటౌట్ చూపించడం విశేషం. విజయ్ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. రాజా రాణి.. తెరి సినిమాల దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలవుతుంది.