Begin typing your search above and press return to search.

కూతురుపై కేసు పెట్టిన సీనియర్‌ నటుడు

By:  Tupaki Desk   |   21 Sep 2018 6:16 AM GMT
కూతురుపై కేసు పెట్టిన సీనియర్‌ నటుడు
X
తమిళ సినీయర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ తన సొంత కూతురు వనితపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది తమిళ ఇండస్ట్రీ అయ్యింది. తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా విజయ్‌ కుమార్‌ కు మంచి గుర్తింపు ఉంది. ఈయన పలు తెలుగు సినిమాల్లో నటించి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో డబ్బింగ్‌ అయ్యాయి. ఇప్పటికి కూడా నటుడిగా బిజీగా ఉన్న విజయ్‌ కుమార్‌ ఈ వయస్సులో కూతురుతో ఎందుకు విభేదించాల్సి వచ్చిందో అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

విజయ్‌ కుమార్‌, కూతురు వనితల మద్య నెలకొన్న వివాదం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయ్‌ కుమార్‌ కు ఆయన నాల్గవ కూతురు వనితల మద్య గత కొంత కాలంగా ఆస్తి విషయంలో తగాదాలు నడుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరి మద్య కొన్నాళ్లుగా మాటలు కూడా లేవని, విజయ్‌ కుమార్‌ తో వనితకు రాజీ కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా కూడా వారిద్దరు మొండి పట్టుదలతోనే ఒకరంటే ఒకరు కోపంతో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే విజయ్‌ కుమార్‌ ఇంటిని వనిత స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందట.

ఇటీవల ఒక చిత్రం షూటింగ్‌ కోసం విజయ్‌ కుమార్‌ ఇంటిని అద్దెకు వనిత తీసుకోవడం జరిగింది. ఆమె నటిస్తున్న ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని - గడువు ముగిసిన తర్వాత కూడా వనిత ఇంటిని తన ఆధీనంలోనే ఉంచుకుందట. అది తన ఇల్లు అంటూ అజమాయిసీ చేస్తుందట. దాంతో విజయ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడట. ఫిర్యాదులో తన కూతురు వనిత తన ఇంటిని స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించాడు. పోలీసులు ప్రస్తుతం ఇద్దరి మద్య చర్చలు జరుపుతున్నారని, ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయకుండానే రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.