Begin typing your search above and press return to search.

దర్శకుడిపై దాడి చేసిన అత్త

By:  Tupaki Desk   |   8 March 2017 8:21 AM GMT
దర్శకుడిపై దాడి చేసిన అత్త
X
నితిన్ తో గుండె జారి గల్లంతయిందే లాంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా.. ఈ నెల 1వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఇతనిపై తాజాగా కొత్త పెళ్లి కూతురు తరఫువారు దాడి చేశారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించి.. పెళ్లి చేసుకోగా.. పెళ్లైన వారం రోజులకే ఇలాంటి సంఘటన గమనించాల్సిన విషయం.

మంగళవారం నాడు ఈ దర్శకుడి భార్య ప్రసూన తల్లి అయిన స్వరూపారాణి.. ఇతనిపై దాడి చేసింది. అంతే కాదు.. హైద్రాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన జరిపింది కూడా. స్వయంగా తన కన్న తల్లే భర్తపై దాడి చేయడంతో.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు ఈ దంపతులు. అంతే కాదు.. తన వారి నుంచి తామిద్దరికీ హాని ఉన్నట్లు పోలీసులకు చెప్పడమే కాకుండా.. రక్షణ కల్పించాలని కోరారు కూడా. తామిద్దరం ఇష్టపడ్డామని చెప్పిన ప్రసూన.. అందుకే పెళ్లి చేసుకున్నామని.. ఇప్పుడు సొంత తల్లిదండ్రుల నుంచే హాని పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోందని అంటోంది.

ఇక విజయ్ కుమార్ కొండా సినిమాల విషయానికి వస్తే.. గుండె జారి గల్లంతయిందే అంటూ సూపర్ హిట్ తీసిన తర్వాత.. ఒక లైలా కోసం అంటూ చైతుతో తీసిన మూవీ యావరేజ్ గా నిలిచింది. అప్పటి నుంచి రెండున్నరేళ్లకుపైగా సినిమా చేయని ఈ దర్శకుడు.. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ మూవీకి ఓకే అనిపించుకున్నాడనే టాక్ ఉంది. త్వరలోనే ఈ మూవీ అనౌన్స్ మెంట్ రావచ్చని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/