Begin typing your search above and press return to search.

డైరక్టర్ పర్సనల్ లైఫ్‌.. ఆల్ ఈజ్ వెల్

By:  Tupaki Desk   |   2 Jun 2017 4:19 AM GMT
డైరక్టర్ పర్సనల్ లైఫ్‌.. ఆల్ ఈజ్ వెల్
X
గుండెజారి గల్లంతయ్యిందే అంటూ నితిన్ తో మూవీ చేసి బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యతో సినిమా ఒక లైలా కోసం అంటూ సినిమా చేశాడు. ప్రస్తుతం బన్నీ డీజే మూవీతో రచ్చ చేస్తున్న పూజా హెగ్డేను టాలీవుడ్ కు తెచ్చినది ఈ దర్శకుడే.

మరోవైపు విజయ్ కుమార్ కొండా కొత్త ప్రాజెక్టు పై ఇంకా క్లారిటీ రాలేదు. వరుణ్ తేజ్ తో ఓ మూవీ ఉంటుందనే టాక్ వచ్చింది కానీ.. దానిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏదీ రాలేదు. అయితే.. ఈ ఏడాది మార్చ్ లో విజయ్ కుమార్ కొండా పెళ్ళి చేసుకున్నాడు. కేవలం అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి పిలవగా.. సీక్రెట్ గా చేసుకున్నాడని.. అమ్మాయి తరుపువారు ఏదో కేసులు పెట్టారని అన్నారు. అత్తగారు దాడి చేశారంటూ.. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి.

అయితే.. ఇప్పుడీ గొడవలన్నీ సమసిపోయినట్లున్నాయి. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నాడు. రీసెంట్ గా 'అందగాడు' ప్రీమియర్ కు వచ్చిన విజయ్ కుమార్ కొండా.. తన భార్య ప్రసూనను కూడా తీసుకొచ్చాడు. కొత్త జంట కొత్త సినిమాకు కలిసి వచ్చి బాగానే ఎంజాయ్ చేశారు. ప్రేమకథలను తీసే ఈ దర్శకుడి ప్రేమకథ.. ప్రాబ్లెమ్స్ అన్నీ తీరిపోయి మొత్తానికి సుఖాంతం అయిందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/