Begin typing your search above and press return to search.
సీఎం కొడుకుతో సినిమా.. ఏం సాధిస్తాడు?
By: Tupaki Desk | 24 Nov 2018 7:57 AM GMTతొలి సినిమా సూపర్ హిట్.. రెండో సినిమా యావరేజ్.. ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడు మూడేళ్లకు పైగా ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. విజయ్ కుమార్ కొండా పరిస్థితి ఇదే. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడతను. తర్వాత నాగచైతన్య-పూజా హెగ్డే కాంబినేషన్లో అతను తీసిన ‘ఒక లైలా కోసం’ ఓ మోస్తరుగా ఆడింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. చెత్త సినిమా అయితే కాదు. ఐతే ఆశ్చర్యకరంగా ఈ సినిమా తర్వాత విజయ్ కి మరో అవకాశం దక్కలేదు. నితిన్ హీరోగా ఓ సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. మధ్యలో తన పెళ్లికి సంబంధించిన చిన్న గొడవ వల్ల అతను సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు.
తర్వాత అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమైన విజయ్ కుమార్.. ఇప్పుడు శాండిల్ వుడ్లో ఓ ఛాన్స్ పట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా విజయ్ ఓ సినిమా చేయనున్నాడట. నిఖిల్ హీరోగా పరిచయం అయిన ‘జాగ్వార్’ తీసింది కూడా ఓ తెలుగు దర్శకుడే. ‘మిత్రుడు’తో దర్శకుడిగా పరిచయం అయిన మహదేవ్ ఆ చిత్రాన్ని రూపొందించాడు. అది డిజాస్టర్ అయింది. మహదేవ్ అడ్రస్ లేకుండా పోయాడు. కన్నడ హీరోలు.. ప్రేక్షకుల అభిరుచి వేరు. హీరోలు ఎక్కువగా మాస్ సినిమాలే చేస్తుంటారు. ఫార్ములా కథల చుట్టూ తిరుగుతుంటారు. విజయ్ కూడా అలాంటి సినిమానే చేయక తప్పదు. అలాంటి సినిమాల వల్ల అతడి కెరీర్ ఏమాత్రం పుంజుకుంటుందన్నది డౌటు. ఇప్పుడెలాగో ఓ అవకాశం అయితే దక్కించుకున్నాడు కానీ.. తర్వాత శాండిల్ వుడ్లో అతడికి ఏమాత్రం కెరీర్ ఉంటుందన్నది డౌటు. ఎలాగోలా తెలుగులోనే ఓ సినిమా దక్కించుకోగలిగితే కెరీర్ పుంజుకునేదేమో. కన్నడలోకి వెళ్లి అతనేం సాధిస్తాడో చూడాలి మరి.