Begin typing your search above and press return to search.
గుండె జారి .. సీక్వెల్ కథేనా?
By: Tupaki Desk | 18 March 2019 4:20 AM GMTనితిన్ హీరోగా నటించిన `గుండె జారి గల్లంతయ్యిందే` ఏ స్థాయి బ్లాక్ బస్టరో తెలిసిందే. కన్ఫ్యూజన్ లోంచి పుట్టుకొచ్చే కామెడీ.. కన్ఫ్యూజన్ లవ్ ఎలిమెంట్స్ ని తెలివిగా హ్యాండిల్ చేయడంలో యువదర్శకుడు విజయ్ కుమార్ కొండా పనితనానికి క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్ లో మోస్ట్ ఛాలెంజింగ్ డైరెక్టర్ గా ఎదిగేందుకు అతడికి అవకాశం ఉందని అంతా గెస్ చేశారు. ఆ క్రమంలోనే నాగచైతన్య - పూజా హెగ్డే జంటగా `ఒక లైలా కోసం` సినిమా తీశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కట్ చేస్తే ఆ తర్వాత సీనే వేరుగా మారింది. చకచకా అతడి వ్యక్తిగత జీవితంలో పలు సన్నివేశాలు సినిమా తీరుగానే సాగిపోయాయి. గత కొంతకాలంగా విజయ్ కుమార్ కొండా పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. లవ్ మ్యారేజ్ మ్యాటర్ లో ఫ్యామిలీ పరంగా కొన్ని కలతల్ని ఎదుర్కోవడమే అందుకు కారణం. కారణం ఏదైనా అతడు అన్నిటికీ చెక్ పెట్టి తిరిగి కెరీర్ పై శ్రద్ధ పెట్టాడట. ఆ మేరకు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల గత కొంతకాలంగా విజయ్ కుమార్ కొండా ట్విట్టర్ లో యాక్టివ్ గానే ఉంటున్నారు. అప్పట్లో కశ్మీర్ - పుల్వామా దాడి ఘటనపై తనదైన బాణి వినిపించే ప్రయత్నం చేశాడు. దేశభక్తికి సంబంధించిన విజ్ఞాన దాయకమైన విషయాలపై విజయ్ ఆసక్తి కనిపించింది. అలాగే మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేరొక ఆసక్తికర ట్వీట్ ని చేశాడు. `వితౌట్ హెర్ ఈవెన్ హీరో ఈజ్ జీరో.. హ్యాపీ ఉమెన్స్ డే` అని రాసి ఉన్న ఇమేజ్ కి.. ``పురుషులందరికీ అంతర్జాతీయ `అంతేగా అంతేగా` దినోత్సవ శుభాకాంక్షలు`` అంటూ కాస్త ఫన్నీగా సెటైరికల్ గా ట్వీట్ చేశారు. మొత్తానికి విజయ్ లోని ఆ సెటైరికల్ యాటిట్యూడ్ ఇంకా అలానే ఉంది.
ప్రస్తుతం అతడు తన తొలి బ్లాక్ బస్టర్ కథానాయకుడు నితిన్ కి కథ వినిపించే పనిలో ఉన్నాడట. ఇప్పటికే లైన్ వినిపించాడు.. నితిన్ ఓకే అన్నాడు.. స్క్రిప్టు పూర్తిగా రెడీ కావాల్సి ఉంది. అయితే `గుండె జారి గల్లంతయ్యిందే` తరహా లాజిక్ ఉన్న స్క్రిప్టునే అతడు రాస్తున్నాడా? లేక ఆ సినిమాకి సీక్వెల్ కథే రాస్తున్నాడని భావించాలా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు. నితిన్ సైతం ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సంబంధించి వివరాల్ని వెల్లడిస్తానని ఇటీవల క్లూ ఇచ్చాడు. మరి అందులో విజయ్ కుమార్ కొండా కథ ఉంటుందా? లేదా? అన్నది వేచి చూడాలి. మరోవైపు కన్నడ యువహీరో నిఖిల్ గౌడకు విజయ్ కుమార్ కొండా టచ్ లోనే ఉన్నాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో కలిసి నిఖిల్ గౌడ బర్త్ డే ఈవెంట్ లోనూ కొండా ప్రత్యక్షమయ్యాడు. మొత్తానికి సీరియస్ ప్రయత్నాల్లోనే ఉన్నాడని దీనిని బట్టి అర్థమవుతోంది.