Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మా నాన్నే మా హీరో..

By:  Tupaki Desk   |   1 Dec 2016 11:30 AM GMT
ఫోటో స్టోరీ: మా నాన్నే మా హీరో..
X
సాధారణంగా ఏ పిల్లలకైనా నాన్నే హీరో. చాలామంది తమ తండ్రిని సూపర్ హీరో కింద భావిస్తూ ఉంటారు. సీనియర్ నటుడు విజయ్ కుమార్ పిల్లలు ఐదుగురు ఇప్పుడు అదే చెబుతున్నారు. ఈయన టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరే. మాస్టర్.. ఖుషీ.. 100పర్సెంట్ లవ్ లాంటి చిత్రాలలో కీలక పాత్రలతో ఆకట్టుకున్నారీయన.

విజయ్ కుమార్ పిల్లలు తమ తండ్రే తమ హీరో అని మాటలతో కాకుండా.. 'మై డాడ్ ఈజ్ మై హీరో' అని రాసి ఉన్న ఒకే రకమైన టీ షర్టులను ధరించి మరీ పోజ్ ఇచ్చారు. పిల్లలందరి మధ్యలో విజయ్ కుమార్ ఆనందగా కూర్చున్న పోజ్ అయితే అదరహో అనాల్సిందే. ఈయనకు ఆరుగురు సంతానం. వీరిలో మనకు పరిచయమున్నవారు కూడా ఉన్నారు గుర్తు పట్టారా. కొడుకు అరుణ్ విజయ్ ఎవరో కాదు.. రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీలో విలన్ గా కనిపించాడు. ఇతనితో పాటు కవిత.. అనితలు కూడా విజయ్ కుమార్ మొదటి భార్య ముత్తుక్కన్ను సంతానం.

సీనియర్ నటి మంజుల.. విజయ్ కుమార్ కు రెండో భార్య. వీరిద్దరికి ముగ్గురు ఆడపిల్లలు కాగా.. వీరంతా కూడా సినిమాల్లో నటించిన వారే. వనిత.. ప్రీత(రుక్మిణి)లు.. శ్రీదేవి.. ఇలా అందరూ సినిమాల్లో సత్తా చూపించిన వారే. మొదటి భార్య పిల్లలైన కవిత-అనితలు మినహాయిస్తే.. ఫ్యామిలిలో అంతా యాక్టర్సే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/