Begin typing your search above and press return to search.
'మాస్టర్' సినిమా నిడివి అంత ఉందా..?
By: Tupaki Desk | 29 Dec 2020 5:30 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న మూవీ ''మాస్టర్''. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్ పై జేవియర్ బ్రిట్టో నిర్మించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 'యూ/ఏ' సర్టిఫికేట్ దక్కించుకుంది. ఈ క్రమంలో తాజాగా 'మాస్టర్' సినిమా నిడివి గురించి డిస్కషన్ జరుగుతోంది.
'మాస్టర్' చిత్రాన్ని ఫైనల్ గా 178 నిమిషాలకు కుదించారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా సుమారు మూడు గంటల రన్ టైం ఉందన్నమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివితో వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా, ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించగా ఆండ్రియా కీలక పాత్రలో కనిపించనుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా 'మాస్టర్' టైటిల్ తో రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. ఇటీవల తెలుగు ట్రైలర్ మరియు చిట్టీ స్టోరీ సాంగ్ ని రిలీజ్ చేశారు. విజయ్ కి తెలుగులో ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.