Begin typing your search above and press return to search.

మాస్టర్‌ ఆ 200 కోట్లు ఇవ్వాల్సిందేనా?

By:  Tupaki Desk   |   1 Jun 2020 10:18 AM GMT
మాస్టర్‌ ఆ 200 కోట్లు ఇవ్వాల్సిందేనా?
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ గత రెండు మూడు సంవత్సరాలుగా నటించిన సినిమాలు అన్నీ కూడా వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. మినిమం వంద కోట్లు అంటూ దూసుకు పోతున్న విజయ్‌ ఈ ఏడాది సమ్మర్‌ లో మాస్టర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో దూసుకు పోతున్న విజయ్‌ కి ఈ విపత్తు సమయం బ్రేక్‌ వేసింది. గత నెలలో విడుదల కావాల్సిన విజయ్‌ మాస్టర్‌ సినిమాను ఇప్పటికే 200 కోట్లకు అమ్మేశారు.

మాస్టర్‌ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా ఈ విపత్తు కారణంగా ఎప్పటికి విడుదల అయ్యేది తెలియని పరిస్థితి. ఈ ఏడాది విడుదల అయ్యేది అనుమానమే అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మాస్టర్‌ చిత్రంను కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పుడు తాము పెట్టిన మొత్తంను వెనక్కు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని నెలలు వడ్డీ వృదా అవ్వడంతో పాటు సినిమా అప్పటికి విడుదల అయిన తర్వాత కూడా పెట్టిన పెట్టుబడి వచ్చేనో లేదో తెలియదు.

సినిమాలు గతంలో మాదిరిగా ఆడాలి అంటే ఖచ్చితంగా ఏడాది అయినా అవ్వాలంటున్నారు. దాంతో మాస్టర్‌ సినిమాపై బయ్యర్లకు అనుమానాలు కలుగుతున్నాయట. అందుకే ఎక్కువ శాతం బయ్యర్లు తాము పెట్టిన మొత్తంను ఇవ్వాల్సిందిగా నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. కొందరు విజయ్‌ వద్దకు కూడా వెళ్లి తాము పెట్టిన మొత్తంను ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారట. ఈ వివాదం మెల్ల మెల్లగా రాజుకుని పెద్దగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో విజయ్‌ ఎలా స్పందిస్తాడనేది తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది.