Begin typing your search above and press return to search.
అతికి పీక్స్ అంటే ఇదే సామీ!!
By: Tupaki Desk | 29 Aug 2017 5:27 PM GMTఒక సినిమాకు ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరేమీ కొత్త పదం కాదు. ఎక్కడో ఎప్పుడో విన్న పదమే ఉంటుంది. కాకపోతే ఆ పేరును కాస్త కొత్త తరహాలో జనాలకు రీచ్ అయ్యేలా చేస్తాం అంతే. కాని ఎవరన్నా ఆ పేరు నాదే అంటూ ఇప్పుడు ట్రేడ్ మార్క్ చేయించుకున్నారు అనుకోండి.. అది ఎలా ఉంటుంది? 'ఇంద్ర' అనే పేరు నాది అని మెగాస్టార్ చిరంజీవి చెప్పినా.. 'పైసా వసూల్' అనే పదాలను ఎవ్వరూ వాడకూడదని బాలయ్య చెప్పినా.. వినడానికి వెటకారంగా ఉంటుంది. అయితే ఇది నిజంగానే జరిగింది తెలుసా.
తమిళ హీరో విజయ్ ఇప్పుడు 'మెర్సాల్' అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అవుతోంది కాబట్టి.. ఎవరన్నా ఇష్టం వచ్చినట్లు 'మెర్సాల్ ఇడ్లీ' - 'మెర్సాల్ సాంబార్' - 'మెర్సాల్ పట్టుచీరలు' - 'మెర్సాల్ కబడ్డీ టీమ్' అని పేర్లు పెట్టుకోకుండా.. మనోళ్ళు 'మెర్సాల్' అనే టైటిల్ ను ట్రేడ్ మార్క్ చేయించారు. ఒక ప్రొడక్టు ఉందనుకోండి.. అంబికా దర్బార్ బత్తి అని ఇంకొకరు పేరు పెట్టుకోకుండా ట్రేడ్ మార్క్ చేస్తారు కాని.. ఇలా మూడు నెలలు ధియేటర్లో ఆడిపోయే సినిమా టైటిల్ ను కూడా ట్రేడ్ మార్క్ చేయిస్తారా? కాని వీళ్ళు చేయించారు. ఇక మీద ఎవరైనా ఈ మెర్సాల్ పేరును వాడాలంటే మాత్రం రాయల్టీ చెల్లించుకోవాలట. జస్ట్ అతితో సరిపెట్టకుండా.. ఆ అతిని పీక్స్ రేంజుకు తీసుకెళితే ఇలాగే ఉంటుందేమో.
అయితే సన్నిహితులు కొందరు విప్పేసిన సీక్రెట్ ఏంటంటే.. ఎవరో ప్రొడ్యూసర్ ఆల్రెడీ మెర్సాల్ అనే పదం వచ్చేలా ఒక టైటిల్ ను ఎప్పుడో రిజిష్టర్ చేయించారట. అందుకే ఇప్పుడు వీళ్ళు 'మెర్సాల్' అనే పదాన్ని తమదే అంటూ ట్రేడ్ మార్క్ చేయించారు. రేపు కోర్టులో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రిజష్టర్ చేయించిన టైటిల్ కంటే.. వీళ్ళు చేయించిన ట్రేడ్ మార్కుకే పవర్ ఎక్కువ ఉంటుంది. సో టైటిల్ కొట్టేయడానికే ఇలా చేశారనేది ఒక రూమర్. అది సంగతి.