Begin typing your search above and press return to search.

విజ‌య్ ని ఢీ కొట్ట‌డానికి అధీరానే దించేస్తున్నారా?

By:  Tupaki Desk   |   12 Sep 2022 11:30 PM GMT
విజ‌య్ ని ఢీ కొట్ట‌డానికి అధీరానే దించేస్తున్నారా?
X
కోలీవుడ్ సంచ‌ల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌దుప‌రి చిత్రంపై నెలకొన్న‌ ఎగ్జైట్ మెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `ఖైదీ`..`విక్ర‌మ్` చిత్రాల‌తో న‌యా ద‌ర్శ‌కుడి పేరు పాన్ ఇండియా వైడ్ మారు మ్రోగిపోతుంది. బ‌డా హీరోలే లోకేష్ క్యూలో ఉన్నారంటే? స‌న్నివేశం ఎలా ఉందో? అర్ధ‌మ‌వుతుంది. వాళ్లంద‌ర్నీ హోల్డ్ లో పెట్టి లోకేష్ త‌దుప‌రి చిత్రాన్ని ఇల‌య‌త‌ల‌ప‌తి విజ‌య్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ సినిమాపై అభిమానులు స‌హా ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి త‌గ్గ‌ట్టే విజ‌య్ పాత్ర‌ని గ్యాంగ్ స్ట‌ర్ గా మ‌లిచారు. లోకేష్ హీరోని గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో ఎలా ఎలివేట్ చేస్తాడో ? చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌ని గ‌త చిత్రాలే హీరో ఎలివేష‌న్ స్థాయి పీక్స్ లో ఉంటుంద‌ని చూస్తే తెలుస్తోంది. అందులోనూ ఈసారి ఏకంగా కోలీవుడ్ సూప‌ర్ స్టార్ నే గ్యాంగ్ స్ట‌ర్ గా చూపిస్తున్నాడంటే ఆ పాత్ర నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి.

నివేదికల ప్రకారం విజ‌య్ ని ఢీకొట్ట‌డానికి ఏకంగా బాలీవుడ్ నటుడ్నే రంగంలోకి దించుతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. మున్నాభాయ్ సంజయ్ దత్ ని ప్రధాన విలన్ పాత్రకి ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. అదే నిజ‌మైతే సినిమా స్పాన్ ఇంకా పెరుగుతుంది. మున్నాభాయ్ ఇమేజ్ తో బాలీవుడ్ ని సైతం షేక్ చేయోచ్చు.

ఇటీవ‌లే సంజయ్ దత్ కేజీఎఫ్‌ చాప్టర్ 2లో ప్రతినాయకుడి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అధీరా పాత్ర‌లో ద‌త్ ఆహార్యం ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ప‌వ‌ర్ పుల్ రోల్ లో అద్భుతంగా న‌టించారు. హిందీ బెల్ట్ లో వందల‌ కోట్లు వ‌సూళ్లు సాధించిందంటే దాని వెనుక ద‌త్ ప్రమేయం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ పాత్ర‌ని మెచ్చే లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న సినిమా కోసం సంజ‌య్ ద‌త్ ని తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది.

ఈ రోల్ కోసం సంజ‌య్ ద‌త్ భారీగానే ఛార్జ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. దాదాపు 10 కోట్ల రూపాయలు రెమ్యున‌రేష‌న్ గా తీసుకుంటున్నట్లు వినికిడి. ఈ పాన్-ఇండియన్ చిత్రం నవంబర్‌లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ప్ర‌స్తుతం విజయ్ తెలుగు..త‌మిళ్ లో `వారసుడు` సినిమా చేస్తున్నారు. ఇటీవ‌లే షూటింగ్‌ కూడా పూర్తి చేసారు. బ్యాలెన్స్ ప‌నులు పూర్తిచేసి జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేయ‌నున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.