Begin typing your search above and press return to search.
ఈ కాన్సెప్ట్ తో హ్యాట్రిక్ కొడతారా?
By: Tupaki Desk | 16 Nov 2017 3:53 PM ISTమెర్సల్ సినిమాతో విజయ్ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ సినిమా రికార్డులను మరోసారి తిరగరాశాడు. ఆకట్టుకునే స్టోరీతో వచ్చిన ఆ సినిమా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా తెలుగులో అదరింది పేరుతో విడుదల అయిన మెర్సల్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ నెక్ట్స్ ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తన తర్వాతి సినిమాని విజయ్.. మురగదాస్ డైరెక్షన్ లొనే చేయనున్నాడు. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన తుపాకీ - కత్తి సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. ఈ సారి కూడా విజయ్ తో మురగదాస్ మరో బాక్స్ ఆఫీస్ సక్సెస్ మూవీ తీసి హ్యాట్రిక్ కాంబినేషన్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బెంగుళూరులో మురగదాస్ కథ రాసుకుంటున్నాడు. అది పూర్తిగా సోషల్ ఎలిమెంట్ ఉన్న కథ అని తెలుస్తోంది. అంతే కాకుండా రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం విజయ్ ఆ కథలో 35 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
అదే విధంగా తన పాత్రకు తనే ధీటైన విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా ఈ ప్రాజెక్ట్ పై అనేక రూమర్స్ వస్తున్నాయి. ఫైనల్ గా కథ పూర్తయితే మురగదాస్ ఓ బడా నిర్మాణ సంస్థతో కలిసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగులో కూడా ఆ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని విజయ్ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొనున్నాడని సమాచారం.