Begin typing your search above and press return to search.
ఆ హీరో సీఎం కుర్చీపై కన్నేశాడా..?
By: Tupaki Desk | 16 Oct 2015 11:08 AM GMTదక్షిణాదిలో ముఖ్యమంత్రి పీఠాలు అధిరోహించడం నటులకు కొత్తేమీ కాదు. తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సినీహీరోలు - హీరోయిన్లు కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఇంకా చాలామంది నటులు ప్రజా ప్రతినిధులయ్యారు... పార్టీలు స్థాపించుకున్నారు. తాజాగా మరో హీరో కూడా సీఎం పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల హీరో విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ ప్రచారం జోరందుకుంది.
విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ ఇటీవల తన కొడుకుకు ఓ సలహా ఇచ్చారట.. 50 ఏళ్లు వచ్చే వరకు పూర్తిగా నటన పైనే దృష్టి సారించమని.. రాజకీయాల వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పారట. విజయ్ కొత్తగా పార్టీ పెట్టాలనుకుని తండ్రికి ఆ విషయం చెప్పడంతో ఆయన ఈ సలహా ఇచ్చినట్లు కోలీవుడ్ అంటోంది.
విజయ్ సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తుంటారు. హీరోగానూ ఆయనకు మంచి ఇమేజి ఉంది. రజనీకాంత్ - కమల్ హాసన్ - విజయ్ కాంత్ తరం తరువాత ఆ రేంజిలో స్టార్ డమ్ సాధించికున్నది విజయ్ - అజిత్ లే. అందుకే విజయ్ తమిళ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఆయన ఇప్పటికే సర్వే చేయించారని... తమిళనాడులో దాదాపు 75 శాతం మంది విజయ్ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆ సర్వేలో తేలిందని సమాచారం. తమిళనాడు భవిష్యత్తు నేత విజయ్ అని చాలామంది భావిస్తున్నారట. కొందరు హీరోలు, నటుల పేర్లతో జాబితాలు ఇచ్చి వీరిలో ఎవరు రాజకీయాల్లోకి వస్తే మేలు జరుగుతుంది.. ఎవరు సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారని తమిళనాడు వ్యాప్తంగా సర్వే చేస్తే 75 శాతం మంది విజయ్ పేరుకే ఓకే అన్నారట. దీంతో విజయ్ ఫుల్ కాన్ఫిడెంటుగా ఉన్నా తండ్రి మాత్రం ఆగమంటున్నట్లు చెబుతున్నారు. మరి విజయ్ నాన్న మాట వింటాడో.. 'అమ్మ' కుర్చీకి ఎసరు పెడతాడో చూడాలి.