Begin typing your search above and press return to search.
పులి నష్టాలు 30 కోట్లు పైనే
By: Tupaki Desk | 18 Oct 2015 7:30 AM GMTబాహుబలిని కొట్టే సినిమా ఒకటి వస్తోంది. విజయ్ నటించిన పులి చిత్రానికి ఆ సత్తా ఉంది అంటూ ప్రచారం సాగించారు. అయితే బాహుబలి స్టామినా ముందు పులి తోక ముడవాల్సి వచ్చింది. ఏ కోణంలో చూసినా పులి సినిమా డిజాస్టర్ అని తేల్చేశారు విశ్లేషకులు. వాస్తవానికి పులి రిలీజైన మొదటివారంలోనే 71 కోట్లు వసూలు చేసిందంటూ నిర్మాతలు ప్రకటించారు.
వాస్తవంగానే అంత పెద్ద వసూళ్లు తెచ్చిందని అనుకున్నా పులి సినిమా వల్ల దాదాపు 30 కోట్లు పైగానే బయ్యర్లు నష్టపోవాల్సి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. 71 కోట్లు గ్రాస్ అనుకుంటే షేర్ వసూళ్లు ఇంచుమించు 50కోట్లు ఉంటాయి. ఆ తర్వాతి వారం షేర్ మరో 20 కోట్లు వసూలైంది అనుకున్నా .. పులి టోటల్ రన్ లో 70 కోట్లు మించి వసూలు చేసి ఉండదు.
అయితే ఈ సినిమాని 105 కోట్లకు బయ్యర్లకు అమ్మేశారు. కాబట్టి ఆ మిగిలిన 30 కోట్లు నష్టం కిందే లెక్క. అలాగే పులి తెలుగు రిలీజ్ హక్కులు తీసుకున్న ఎస్వీఆర్ మీడియాకి భారీగానే నష్టాలు వచ్చి ఉంటాయన్న అంచనాలున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం సదరు సంస్థ 7 కోట్లు పైగానే వెచ్చించిందని చెబుతున్నారు. టూ బ్యాడ్ టైగర్!