Begin typing your search above and press return to search.
బాహుబలి దెబ్బకు పులి బలి కానుందా ?
By: Tupaki Desk | 25 July 2015 11:20 AM GMTభారీ బడ్జెట్ సినిమాలు అంటే ఎప్పుడూ రిస్కే. అయితే స్టార్ హీరోలు, డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు భారీగా ఉండడంతో... ఇప్పుడు పెద్ద హీరోలతో తీసే ప్రతీ సినిమా భారీ బడ్జెట్ వే అవుతున్నాయి. వీటినే భారీ అంటూ వర్ణిస్తే... మరి బాహుబలి ని ఏమనాలి ? సినిమా కోసం 230 కోట్లు ఖర్చుపెట్టామ ని చెప్పినపుడు ముక్కున వేళ్లేసుకున్నారు జనాలు. ఇందులో మూడో వంతు మాత్రమే అప్పటికి తెలుగు సినిమా స్టామినా. అయితే.. ఈ స్టామినా, సత్తా, స్టేటస్, కెపాసిటీ లాంటి అడ్డంకులన్నిటినీ దాటేసి... బాహుబలి ఓ చరిత్ర సృష్టిస్తోంది. 400 కోట్లు షుమారు వసూలు చేసేసింది.
ఇలా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఇప్పుడో తమిళ సినిమాకి కూడా ఇలాంటి అవసరమే ఉంది. ఇళయదళపతి విజయ్ హీరోగా... పులి పేరుతో ఓ జానపద చిత్రం తెరకెక్కింది. దీనిలో భారీ తారాగణమే ఉంది. అలనాటి అందాల తార శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక, కన్నడ స్టార్ సుదీప్... వంటి హేమాహేమీలు పులిలో నటించారు. అంతా కలిసి... ఈ జానపద చిత్రానికి తీయడానికి అయిన ఖర్చు తడిసిమోపెడైంది. 120 కోట్లు ఖర్చుపెట్టారు పులి కోసం. ఇప్పుడు దీన్ని రాబట్టుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
బాహుబలిని జక్కన్న మూడేళ్ల పాటు చెక్కాడు. తన డ్రీం ప్రాజెక్టు కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూసేలా చేసి, తిరుగులేని సక్సెస్ సాధించాడు. మంచి సినిమా వస్తే, జనాలు ఎగబడి చూస్తారని నిరూపించాడు. తమిళంలోనూ బాహుబలి బాగానే నడుస్తోంది. మరి బాహుబలి చూసిన కళ్లకి... పులి ఆనుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. జక్కన్న తీసిన స్థాయి కంటే తగ్గితే మాత్రం.. పెట్టుబడికి ఆశలు వదులుకోక తప్పదు అనుకుంటోంది తమిళ ఇండస్ట్రీ. చూద్దాం పులి గాండ్రిస్తుందో... లేక బాహుబలి దెబ్బకి బలి అవుతుందో ?