Begin typing your search above and press return to search.
12 నిమిషాల్లో 75 వేల క్లిక్కులా.. దేనికి?
By: Tupaki Desk | 20 Aug 2015 12:25 PM GMTబాహుబలిని కొట్టే ఒక సినిమా వస్తోంది. అది కోలీవుడ్ లో తెరకెక్కుతోంది.. వస్తోంది పులి.. అంటూ ప్రచారం సాగించారు తంబీలు. విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పులి ఫస్ట్ లుక్ టీజర్ కి అసాధారణమైన క్రేజు వచ్చింది ఆన్ లైన్ లో. బాహుబలిని మించి యూట్యూబ్ లో క్లిక్కులొచ్చాయి. లైక్ లు కొట్టడంలో విజయ్ ఫ్యాన్స్ వీరవిహారం చేశారు. అయితే విజయ్ లుక్ చూసినప్పుడే సినీప్రముఖులు పెదవి విరిచేశారు. అతడి మోడ్రన్ హెయిర్ స్టయిల్ ఆ గెటప్ కి సూట్ కాలేదని అన్నారు.
లేటెస్టు ట్రైలర్ వచ్చిందిప్పుడు. టీజర్ రిలీజైన 12 నిమిషాల్లో 75వేల క్లిక్కులు పడ్డాయి. అయితే ఏం లాభం? ఈ ట్రైలర్ చూస్తుంటే మరీ అంత కిక్కు లేదని విమర్శలొస్తున్నాయి. బాహుబలి వార్ ఎపిసోడ్ కి సంబంధించిన గ్రాండియారిటీ కానీ, మగధీర 100మంది వీరుల ఎపిసోడ్ లో కనిపించిన విజుబిలిటీ కానీ ఈ టీజర్ లో ఎక్కడా కనిపించలేదని విమర్శలొస్తున్నాయి. సెట్ లు, కళా నైపుణ్యంలోనూ ఓ వీడియో గేమ్ ని తలపించిందని విమర్శకులు బాణాలు ఎక్కుపెడుతున్నారు. విజువల్స్ చూస్తుంటే తెలుగులో వచ్చిన వర్ణ, అనగనగా ఒక ధీరుడు తరహాలో ఉన్నాయని అంటున్నారు. శ్రీదేవి మహారాణిగా, హన్సిక యువరాణిగా నటించారీ చిత్రంలో. శ్రుతిహాసన్ ఓ అతిధి పాత్రలో తళుక్కుమంటోంది.
బాహుబలిని కొట్టాలంటే 500కోట్ల క్లబ్ లో చేరాలి. అంత హిట్టవ్వకపోయినా 200కోట్లు వసూలు చేసినా సక్సెసయినట్టే. విజయ్ ని అభిమానులే కాపాడాలి. యుట్యూబ్ లో వచ్చే ఈ క్లిక్కులన్నీ మరి హిట్టు కొట్టడానికి ఉపయోగపడతాయా? అలా జరిగినట్లు చరిత్రలో లేదు.