Begin typing your search above and press return to search.
'లైగర్' రీమేక్ వార్తలపై రౌడీ షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 16 Aug 2022 2:30 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ బాక్సింగ్ డ్రామా `లైగర్`. ఈ మూవీని వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి పూరి, చార్మి ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మించారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించిన ఈ మూవీని హిందీతో పాటు తెలుగులో ఏక కాలంలో నిర్మించారు. ఆగస్టు 25న అత్యంత భారీ స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే మూవీ రిలీజ్ కు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్ ని మేకర్స్ హోరెత్తిస్తున్నారు. ఇండియా వైడ్ గా ఫ్యాన్ డమ్ పేరుతో పర్యటిస్తూ జోరుగా మూవీ ప్రచారం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా `లైగర్` మూవీ రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై హీరో విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో స్పందించారు. గతంలో పూర్తి జగన్నానాథ్ తెరకెక్కించిన `అమ్మా నాన్న ఓ అమిళమ్మాయి`కి `లైగర్` రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
`లైగర్` రీమేక్ మూవీ కాదని, తనకు రీమేక్ లు చేయడం ఇష్టం వుండదని, ఎప్పటికీ తాను రీమేక్ లు చేయనని స్పష్టం చేశాడు. `అమ్మానాన్న ఓ తమిళమ్మాయి` అంటే నాకు చాలా ఇష్టం. అయితే `లైగర్` మాత్రం డిఫరెంట్ సినిమా. MMA స్పోర్ట్స్ బాక్సింగ్ కు పూర్తి భిన్నంగా వుంటుంది. ఈ మూవీకి తల్లి కొడుకుల మధ్య వుండే అనుబంధం ప్రధాన హైలైట్ గా నిలవబోతోందని, `లైగర్` చాలా స్వచ్ఛమైన తెలుగు సినిమా అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు.
సినిమాలోని పాటలకు బాలీవుడ్ సంగీత దర్శకులు సంగీతం అందించారు. అయితే కథ మాత్రం పక్కా తెలుగుదే, కరీంనగర్ నుంచి ముంబై వెళ్లే తల్లికొడుకుల కథ ఇది. ఈ కథను మేము యావత్ దేశం మొత్తానికి చెప్పాలనుకుంటున్నాం. ఇదే సందర్భంగా ఈ మూవీపై వున్న భారీ అంచనాలపై స్పందిస్తూ `మేము ఖచ్చితంగా అన్ని అంచనాలను అందుకుంటామన్న నమ్మకం వుంది. నేను ఏది చేసినా భారీగా చేయాలనుకుంటాను. `పెళ్లి చూపులు` సినిమా నా కెరీర్ కు బిగ్ అచీవ్ మెంట్ గా నిలిచింది. ఇక ఆ తరువాత వచ్చిన `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` చిత్రాలు పెద్ద విజయాలుగా నిలిచాయన్నాడు.
ఇక `లైగర్` టెర్రిఫిక్ కంటెంట్ తో అద్భుతంగా తెరకెక్కిందని, చాలా వరకు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బాధ్యత మాది. ఒక్కసారి థియేటర్లకు వస్తే తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు` అని తెలిపాడు విజయ్. `లైగర్` తన కెరీర్ లో చాలా కష్టమైన ఛాలెంజింగ్ మూవీగా అభివర్ణించాడు. శారీరకంగా, మానసికంగా ఈ మూవీ వల్ల ఒత్తిడికి లోనయ్యానన్నాడు. ఈ సినిమా కోసం అన్ని బౌండరీస్ ని చెరిపేశాను. మేకోవర్ కోసం రెండు నెలలు పడుతుందని ముందు భావించాను. కానీ రెండు నెలల తరువాత నా బాడీలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. దీంతో మేకోవర్ కోసం మరింత సమయం తీసుకోవాల్సి వచ్చింన్నాడు.
మధ్యలో నార్మల్ గా వున్న సమయంలోనే కొన్ని సన్నివేశాలని రూపొందించాం. ఫైట్స్, డ్యాన్స్ నేర్చుకోవడం నా దృష్టిలో పెద్ద విషయం. నేను పెద్ద డ్యాన్స్ ని కాదు. అందుకే ప్రతీ పాటకు సంబంధించిన డ్యాన్స్ ని రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. అనన్య బాగా చేసేది కానీ నేను మాత్రం టేక్ లు తీసుకునే వాడిని. తనతో కలిసి వర్క్ చేయడం అద్భుతంగా అనిపించింది` అని వెల్లడించాడు విజయ్. క్లైమాక్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు వున్నాయన్నాడు.
మైక్ టైసన్ లో ఆ సన్నివేశాలని షూట్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. అయితే మైక్ టైసన్ తో కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్నాడు. సినిమాలో తన పాత్రకున్న నత్తి గురించి మాట్లాడుతూ సినిమాలో నా పాత్ర నత్తిగా మాట్లాడటం కీలక అంశాలలో ఒకటి అని, ప్రేక్షకులు దాన్ని బాగా ఇష్టపడతారని, అంతే కాకుండా పాత్రల మధ్య డ్రామా మరింత పెరిగే అవకాశం ఏర్పడిందన్నాడు.
కరణ్ జోహార్ ఈ మూవీకి సహకరించినందుకు విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. `అర్జున్ రెడ్డి` తరువాత కరణ్ నాతో హిందీ సినిమా చేయాలనుకున్నాడని, అయితే ఆ టైమ్ లో నేను హిందీలో సినిమా చేయడానికి సిద్ధంగా లేనని, మేము `లైగర్`ని హిందీలో చేయాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని కరణ్ కు ఫోన్ చేసి చెప్పానని, అయితే స్క్రిప్ట్ వినకుండానే ఓకే చేశాడన్నారు. ఆ తరువాత తనకు కథ వినిపించామని, ఆయన వల్లే `లైగర్` ని ఇండియా లెవెల్లో ప్రమోట్ చేస్తున్నామన్నాడు విజయ్ దేవరకొండ.