Begin typing your search above and press return to search.

80 దేశాల్లో.. సరికొత్త రికార్డులకు ప్రయత్నం

By:  Tupaki Desk   |   29 Oct 2018 8:26 AM GMT
80 దేశాల్లో.. సరికొత్త రికార్డులకు ప్రయత్నం
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటించిన ‘సర్కార్‌’ చిత్రం నవంబర్‌ 6న భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్‌ గత చిత్రం ‘మెర్షల్‌’ భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న కారణంగా ఈ చిత్రంతో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని దాదాపు 80 దేశాల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయట. తమిళనాడు మరియు కేరళలో ఈ చిత్రంను 24 గంటల పాటు ప్రదర్శించేందుకు అనుమతులు తీసుకున్నారు. తమిళనాడు మరియు కేరళలో ఈ చిత్రం ఉదయం 5 గంటలకు షో ప్రారంభించి - వరుసగా అర్థరాత్రి 2.25 వరకు షోలను వేస్తూనే ఉంటారట. రెండు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజే రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడులో 80 శాతం థియేటర్లలో ఈ చిత్రంను ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దగా పోటీ లేని కారణంగా అత్యధికంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయ్‌, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం రాబోయే చిత్రాలకు సరికొత్త రికార్డులను ఉంచబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు. వీరిద్దరి కాంబోకు అద్బుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. అందుకే సర్కార్‌ మూవీ ఎలా ఉన్నా కూడా రికార్డులు మాత్రం నమోదు అవ్వడం ఖాయం అనే విశ్లేషణలు తమిళ మీడియాలో వస్తున్నాయి. తెలుగులో కూడా విజయ్‌ చిత్రాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ నటించడం వల్ల తెలుగులో క్రేజ్‌ ఉంది. విజయ్‌ ఈ చిత్రంతో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు కూడా సవాల్‌ విసరడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. ఇంతగా అంచనాలున్న సర్కార్‌ ఏ రేంజ్‌ లో ఉంటుందో చూడాలి.