Begin typing your search above and press return to search.

లియో తో రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ టార్గెట్ గా పెట్టుకున్న విజయ్!

By:  Tupaki Desk   |   29 April 2023 11:03 AM GMT
లియో తో రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ టార్గెట్ గా పెట్టుకున్న విజయ్!
X
చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక ప్రాంతీయ భాషా చిత్రంమహా అయితే.. ఆ రాష్ట్రంతో పాటు.. మరో రాష్ట్రంలో రిలీజ్ అయ్యేది. కాస్త ఎక్కువ ఇమేజ్ ఉంటే.. ఇంకో రాష్ట్రంలోనే విడుదలయ్యేవి. కానీ.. ఇప్పుడు పాన్ ఇండియా కాన్సెప్టు రావటం.. బాలీవుడ్ మూవీ కంటే సౌత్ సినిమాలకు ఆదరణ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బాలీవుడ్ తో సంచలనాల కు కేరాఫ్ అడ్రస్ గా సౌత్ ఇండస్ట్రీ నిలిచింది. పలు భారీ సినిమాలు వరుస పెట్టి నిర్మితమవుతున్నాయి. అందుకు తగ్గట్లే.. సంచలన విజయాల్ని సొంతం చేసుకోవటమేకాదు.. రికార్డు వసూళ్లతో సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి.

ఒకప్పుడు రెండు మూడు రాష్ట్రాల్లో విడుదల కావటమే గొప్పగా అనుకున్న స్థాయి నుంచి ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాల్లోనూ పెద్ద ఎత్తున స్క్రీనింగ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవటం.. అందుకు తగ్గట్లే విజయాన్ని సొంతం చేసుకోవటం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో తమిళ యువ స్టార్ నటుడు విజయ్ తన తాజా మూవీ 'లియో'తో భారీ టార్గెట్ పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

చాలా కాలం తర్వాత త్రిష తో జత కడుతున్న ఈ మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల సమయంలోనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' విడుదల కానుంది. అక్టోబరులో రిలీజ్ అయ్యే ఈ రెండు సినిమాలు ఒకదాని తో మరొకటి క్లాష్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ తాజా షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పార్టు పూర్తి చేసుకున్న ఈ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తమిళ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

స్క్రిప్టు మీద ఉన్న నమ్మకంతో.. ఈ సినిమా కలెక్షన్లు రూ.వెయ్యి కోట్లు టచ్ అయ్యేలా ప్లాన్ చేయాలన్నది విజయ్ ఆశ గా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రయత్నాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. లియో మూవీ విడుదలకు ముందే రూ.300 కోట్ల బిజినెస్ జరగాలన్నది విజయ్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్ సినిమాల కలెక్షన్లు రూ.500 కోట్ల మార్కు ను అందుకున్న వేళ.. వెయ్యి కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరాలన్న పట్టుదలతో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు.