Begin typing your search above and press return to search.
ఇదంత తన మేకప్ మ్యాన్ కృషి... ఎంతో ఓపికగా..
By: Tupaki Desk | 1 Jan 2022 8:35 AM GMTవిజయ్ సేతుపతి యాక్టింగ్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోగా..విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎలాంటి పాత్రకైనా సరిపోయే ఏకైక కోలీవుడ్ నటుడు. హీరోగానే నటించాలని గిరి గీసుకుని కెరీర్ ప్లాన్ చేసుకోలేదు. పాత్ర నచ్చిందంటే ఎంత చిన్న రోల్ అయినా ఆలోచించకుండా కమిట్ అయ్యేవాడు. అందుకే విజయ్ కి నటుడిగా అంత మంచి గుర్తింపు దక్కింది. ట్యాలెంట్ తో పాటు తనలో సంపూర్ణ నటుడి ఉన్నాడని ఆ క్వాలిటీనే బయటపెట్టింది. తాజాగా విజయ్ సేతుపతి వీధి కళాకారుడిగా అవతారం ఎత్తాడు. తమిళనాడులోని పారం పర్య కళల్లో విధి భాగోతం కళ ( తెరు కూత్తు)ఒకటి.
ఈ కళను నేర్చుకోవాలనే ఆసక్తిని నటుడు విజయ్ వ్యక్తం చేసాడు. విజయ్ ని ఇలా వీధి కళాకారుడి గెటప్ లోకి మార్చింది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిశ్చల ఛాయాగ్రహాకుడు ఎల్. రామచంద్రన్. నూతన సంవత్సరం క్యాలెండర్ కోసం విజయ్ ఇలాంటి అవతారం ఎత్తాడు. అయితే ఇలా మేకప్ వేయడానికి దాదాపు 45 నిమిషాలకు పైగా సమయం పట్టిందిట. ఇలాంటి మేకప్ వేయడం చాలా కష్టమైన పని అని... వేసుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలన్నారు. అయితే ఇదంత తన మేకప్ మ్యాన్ కృషి...అతను ఎంతో ఓపికగా తనని ఇలా తయారు చేసారని అన్నారు.
ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే చేతిలో 12 సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని షూటింగ్ పూర్తిచేసుకోగా..మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇంకొన్ని రిలీజ్కి రెడీ అవుతున్నాయి. కొత్త ఏడాది కానుకగా ఈసారి ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కోలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్న ఏకైక నటుడు కూడా విజయ్ సేతుపతి కావడం విశేషం. `పిజ్జా` సినిమాతో విజయ్ కెరీర్ టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ తర్వాత సేతుపి కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగిపోతుంది.