Begin typing your search above and press return to search.
ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి మీద దాడి..!
By: Tupaki Desk | 3 Nov 2021 3:30 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు - హిందీ చిత్రాల్లో నటిస్తున్న సేతుపతి.. తన విలక్షణమైన నటనతో భాషతో సంబంధం లేకుండా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి విజయ్ సేతుపతికి ఇప్పుడు బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది.
మంగళవారం రాత్రి షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న విజయ్ సేతుపతి పైన ఓ అజ్ఞాత వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ దాడి సేతుపతిపై కాకుండా ఆయన పీఏపై జరిగినట్లు ఈ వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
దీనికి ముందు ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో ఒక వ్యక్తి.. విజయ్ సేతుపతి పీఏతో గొడవకు దిగారట. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న క్రమంలోనే అజ్ఞాత వ్యక్తి కోపంతో విజయ్ సేతుపతి పీఏ ను వెనుక నుంచి కాలితో ఎటాక్ చేశారు. ఆ తర్వాత అతను సేతుపతి తో పాటుగా పీఏ కు సారీ చెప్పడంతో వివాదం ముగిసిందని సమాచారం. ఆ వ్యక్తిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేయవద్దని విజయ్ సేతుపతి కోరినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో విజయ్ సేతుపతి మరియు అతని బృందం నడుస్తుండగా.. వెనక నుంచి ఒక వ్యక్తి బలంగా విజయ్ సేతుపతి పీఏని తన్నారు. ఈ క్రమంలో పీఏ వెళ్లి సేతుపతి ని నెట్టారని స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో విజయ్ షాక్ కు గురై చూస్తూ ఉండగా.. ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే విజయ్ సేతుపతి మీద దాడి జరిగినట్లుగా అనిపించడంతో ఫ్యాన్ ఆందోళనకు గురవుతున్నారు.