Begin typing your search above and press return to search.

కేక్ కట్ చేస్తే.. హీరోతో ఏకంగా క్షమాపణ చెప్పించిందిగా!!

By:  Tupaki Desk   |   16 Jan 2021 1:56 PM GMT
కేక్ కట్ చేస్తే.. హీరోతో ఏకంగా క్షమాపణ చెప్పించిందిగా!!
X
ఈరోజు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ సందర్బంగా విజయ్ తన షూటింగ్ సెట్స్ లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఇటీవలే సంక్రాంతి సందర్బంగా దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న ఈ సినిమాలో హీరో విజయ్ కంటే విలన్ క్యారెక్టర్ పోషించిన విజయ్ సేతుపతికి ఎక్కువగా మార్కులు పడుతున్నాయి.

ఇక తన పుట్టినరోజు వేడుకలో విజయ్ కేక్ కట్ చేసాడు. అయితే మూడు రోజుల ముందే విజయ్ సేతుపతి ఓ కొత్త సినిమా సెట్ లో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. ఈ వేడుకలో విజయ్ తల్వార్ తో కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడమే గాక పలు విమర్శలకు దారితీసింది.

విజయ్ కత్తితో కేక్ కోయడం అనేది యువతను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శలు వినిపించడంతో క్షమాపణలు కోరాడు. అంతేగాక విజయ్ సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేసాడు. నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మూడు రోజుల క్రితం నా పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తీసుకున్న కేక్ కటింగ్ ఫోటో వివాదాస్పదంగా మారింది. ఆ ఫోటోలో కత్తితో బర్త్‌డే కేక్ కట్ చేసాను.

నేను ప్రస్తుతం పొనరమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో ఆ తల్వార్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పొనరమ్, అతని బృందంతో నా పుట్టినరోజు వేడుకను జరుపుకున్నప్పుడు కత్తితో కేక్ కట్ చేయాల్సి వచ్చింది. ఇందుకు పలువురు నన్ను తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటివి ఇంకోసారి రిపీట్ చేయను. నా వలన ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి' అంటూ విజయ్ సేతుపతి తమిళంలో తెలియజేసాడు.