Begin typing your search above and press return to search.
కోలీవుడ్ ను ముంచెత్తనున్న ‘ఉప్పెన’.. రైట్స్ పై కర్చీఫ్ వేసిన స్టార్ హీరో!
By: Tupaki Desk | 18 Feb 2021 11:30 AM GMTమెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ‘ఉప్పెన’ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. భారీ హైప్ తో, అంచనాలతో దూసుకొచ్చిన ఉప్పెన.. అద్వితీయంగా విజయ తీరాలను చేరింది. డెబ్యూ హీరో కేటగిరీలో వైష్ణవ్ తేజ్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు.
ఈ సినిమాలోని ప్రతి అంశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో హీరోయిన్లతోపాటు అందరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక, దర్శకుడు బుచ్చిబాబు సానా.. ఈ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. అద్భుతమైన టేకింగ్ తోపాటు తన పెన్ పవర్ కూడా చూపించాడు బుచ్చి.
అయితే.. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడంతో.. ఇతర భాషల్లో రీమేక్ చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ముందుగా.. తమిళ్ లో ఈ మూవీ రీమేక్ అయ్యేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే.. ఈ చిత్రం రీమేక్ హక్కులు కొనేశారు. అది కూడా ఎవరో కాదు.. ఈ సినిమాలో విలన్ పాత్ర ద్వారా అందరినీ మెప్పించిన విజయ్ సేతుపతే! అవును.. ఉప్పెన తమిళ్ రీమేక్ హక్కులను విజయ్ సేతుపతి దక్కించుకున్నారట.
ఈ సినిమా కథ చాలా నచ్చడంతో.. కోలీవుడ్ లో రీమేక్ చేయాలని భావిస్తున్నారట సేతుపతి. ఈ మేరకు టాలీవుడ్ మేకర్లను సంప్రదించాడట. ఈ సినిమాను తమిళ్‌లోకి డబ్ చేయొద్దని కోరాడట. తమిళ్ లో తానే రీమేక్ చేస్తానని చెప్పి, హక్కులు కూడా సొంతం చేసుకున్నాడట. అతి త్వరలో షూటింగ్ కూడా మొదలు కాబోతుందని సమాచారం.