Begin typing your search above and press return to search.
విజయ్ సేతుపతి ఉదారతకు హ్యాట్సాఫ్!
By: Tupaki Desk | 11 Nov 2017 12:57 PM GMTదక్షిణాది సినీ పరిశ్రమలో కోలీవుడ్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. అక్కడ నటీనటులు సినిమాలతో పాటు రాజకీయాలు - సామాజిక అంశాలపై చురుగ్గా స్పందిస్తుంటారు. అంతేకాకుండా - సేవా కార్యక్రమాలకు సొంత డబ్బును విరాళాలుగా ఇచ్చి తమ ఉదారతను చాటుకుంటుంటారు. ఈ మధ్య కాలంలో సూర్య - విశాల్ వంటి హీరోలు సామాజిక - సేవా కార్యక్రమాల కోసం తమవంతు సాయం చేస్తున్నారు. అదేబాటలో కోలీవుడ్ విలక్షణ హీరో విజయ్ సేతుపతి పయనిస్తున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే మిగతా హీరోలకు భిన్నంగా విజయ్ సేవా కార్యక్రమాల కోసం భారీ విరాళాన్ని ఇచ్చి తన సహృదయాన్ని చాటుకున్నాడు.
తమిళనాడులోని 'అనిల్ సేమియా' కంపెనీకి ప్రచారకర్తగా ఉండేందుకు విజయ్ సేతుపతి అంగీకరించాడు. ఈ ప్రకారం ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా, ఆ కంపెనీ 5 కొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వాటిని విజయ్ సేతుపతి లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా రూ. 50 లక్షల పారితోషికాన్ని విజయ్ అందుకున్నాడు. అయితే, ఆ డబ్బును విజయ్ ఒక సత్కార్యానికి డొనేట్ చేశాడు. తమిళనాడులోని అరియలూర్ జిల్లా..... విద్య - మౌలిక వసతుల కల్పనలో బాగా వెనుకబడి ఉంది. దీంతో - ఆ జిల్లాలోని 774 అంగన్వాడీలు - 10 అంధుల పాఠశాలలు - 11 బధిర పాఠశాలలకు కలిపి అరకోటిని విజయ్ సేతుపతి విరాళంగా ఇచ్చేశాడు. ఒక్కో అంగన్వాడీకి రూ.5,000 - ఒక్కో అంధుల - బధిర పాఠశాలకు రూ.50,000 చొప్పున డొనేట్ చేశాడు. విజయ్ సేతుపతి చేసిన మంచిపనిని పలువురు ప్రశంసిస్తున్నారు. అతడిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది హీరోలు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుతున్నారు.