Begin typing your search above and press return to search.
విజయ్ సేతుపతి తొలిసారి తెలుగులో..
By: Tupaki Desk | 29 Aug 2021 4:06 AM GMTవిజయ్ సేతుపతి స్వతహాగా తమిళుడే అయినా.. తెలుగు వాళ్లలో భారీగానే అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. ఓటీటీల ద్వారా ఆల్రెడీ అతడి సినిమాలకు బాగానే అలవాటు పడ్డారు మన ప్రేక్షకులు. ఇక సైరా, ఉప్పెన లాంటి సినిమాలతో తెలుగులో ఇంకా అతడి ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా ఉప్పెనలో రాయణం పాత్ర సేతుపతికి ఇక్కడ చాలా మంచి పేరు తెచ్చింది. తాజాగా అతను సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కనున్న ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. సేతుపతి కోసం టాలీవుడ్లో చాలామంది దర్శకులు ప్రయత్నిస్తున్నారు కానీ.. డేట్ల సమస్య వల్ల ఇక్కడ సినిమాలు ఒప్పుకునే స్థితిలో లేడు. ఇదిలా ఉంటే.. సేతుపతి నటించిన ఓ సినిమా తొలిసారిగా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అతను నటించిన నేను రౌడీనే, విజయ్ సేతుపతి లాంటి కొన్ని చిత్రాలు ఇప్పటికే తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి.
ఐతే అవి తమిళంలో రిలీజైన కొన్నేళ్లకు తెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా తమిళ, తెలుగు భాషల్లో అతడి సినిమా ఒకేసారి రిలీజ్ కాబోతోంది. ఆ చిత్రమే.. లాభం. రైతుల కోసం పోరాడే ఓ యువకుడి కథ ఇది. ఇందులో సేతుపతి సరసన శ్రుతి హాసన్ నటించింది. మన జగపతిబాబే ఇందులో విలన్. సేతుపతికి ఇటీవల తెలుగులో పెరిగిన ఫాలోయింగ్.. శ్రుతి, జగపతి లాంటి వాళ్లు నటించడంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ నేరుగా రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబరు 9న 'లాభం' ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సీనియర్ దర్శకుడు జననాథన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే కొన్ని నెలల కిందటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టైంలో గుండెపోటుకు గురై జననాథన్ ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత సేతుపతి అండ్ టీం దగ్గరుండి మిగతా పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని విడుదల సిద్ధం చేసింది.