Begin typing your search above and press return to search.

సినిమా టైటిల్ తో బైక్ నెంబర్

By:  Tupaki Desk   |   6 Feb 2019 6:37 AM GMT
సినిమా టైటిల్ తో బైక్ నెంబర్
X
ఈ మధ్య సినిమా ఏదైనా హిట్ అయితే దానికి గుర్తుగా కానుకలు ఇచ్చే ట్రెండ్ బాగా ఊపందుకుంది . నిన్న రామ్ తన ఐస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఇచ్చిన ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కాఫీ ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. ఇది తెలిసిన వెంటనే ఆ కాఫీ ఖరీదు గురించి గూగుల్ లో వెతకిన నెటిజెన్లు లక్షల్లో ఉన్నారు. అలాంటిదే ఇది కూడా.

గత ఏడాది తమిళ్ లో విడుదలైన టాప్ బ్లాక్ బస్టర్స్ చోటు దక్కించుకున్న 96 ఇటీవలే వంద రోజుల వేడుక పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రేమ్ కుమార్ కు హీరో విజయ్ సేతుపతి ఓ అరుదైన కానుకను ఇచ్చాడు. అదే మూడు లక్షలకు పైగా ఖరీదు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్. అందులో పెద్ద విశేషం ఏముంది అనుకోవచ్చు కాని దానికి రిజిస్ట్రేషన్ చేయించిన విజయ్ సేతుపతి నెంబర్ ప్లేట్ మీద కూడా సినిమా పేరు వచ్చేలా ప్రత్యేక ధర చెల్లించి మరీ తీసుకున్నాడు. TN10BF 0096 నెంబర్ తో ఉన్న ఆ బులెట్ చూసి ప్రేమ్ ఆనందానికి అంతు లేదు.

ప్రస్తుతం ఈ 96 తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ సమంతా జంటగా దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన ప్రేమ్ కుమారే దీనికి బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. టీవీలో టెలికాస్ట్ అయినప్పటికీ తమిళ్ లో కొన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడిన మూవీగా 96 ప్రత్యేకతను నిలుపుకుంది. మనదగ్గర మాత్రం టైటిల్ మరీ అవకాశాలు ఉన్నాయి.