Begin typing your search above and press return to search.
ఉప్పెన గొడవపై ఓపెనైన సేతుపతి
By: Tupaki Desk | 14 Sep 2019 1:30 AM GMTజాతీయ ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నాడు విజయ్ సేతుపతి. అతడు నటించిన సూపర్ డీలక్స్ చిత్రానికి ఈ అవార్డ్ దక్కింది. అసలు ఏమాత్రం అంచనా లేకుండానే అంత పెద్ద అవార్డ్ తనకు దక్కడం పట్ల ఉక్కిరి బిక్కరి అయిపోయానని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సేతుపతి వెల్లడించారు. ఈ ట్యాలెంటెడ్ గయ్ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లు అనవాద చిత్రాలతోనే తెలుగు లోగిళ్లను పలకరించిన సేతుపతి స్ట్రెయిట్ గా రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మొదటిది ఉప్పెన. రెండోది సైరా-నరసింహారెడ్డి. అయితే ఈ రెండిటిలో `ఉప్పెన` చిత్రీకరణ చాలా ఆలస్యమవుతోంది. అంతకంటే ముందే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించిన `సైరా` రిలీజైపోతోంది. అందరిలానే తాను కూడా ఈ సినిమా రిలీజ్ గురించి ఎదురు చూస్తున్నానని సేతుపతి తెలిపారు.
సైరా ఆఫర్ గురించి సేతుపతి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి.. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. జగపతిబాబు వంటి టాప్ స్టార్లు నటిస్తున్న ఈ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. చాలా కాలంగా వేచి చూస్తున్న సందర్భమిది. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజవుతోంది. ఆ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాను అని అన్నారు. అలాగే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న `ఉప్పెన` గురించి విజయ్ సేతుపతి క్లారిటీనిచ్చారు. అప్పట్లో `ఉప్పెన` సినిమా నుంచి తప్పుకున్నానని నాపై వార్తలు వచ్చాయని విన్నాను. అయితే అదేమీ నిజం లేదు. నిజానికి ఉప్పెన ప్రీప్రొడక్షన్ పనులు చాలా ఆలస్యం అయ్యాయి. ఐదు నెలలు పైగా వేచి చూడాల్సి వచ్చింది. దీంతో నా తమిళ ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు వెళ్లాను. అందుకే టైమ్ తీసుకున్నాను అని తెలిపారు. ఇప్పటికే ఉప్పెన తొలి షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొన్నానని సేతుపతి వెల్లడించారు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిభావంతుడు. ఆ సినిమా కథాంశం చాలా బావుంది అని సేతుపతి కితాబిచ్చాడు. సుప్రీం హీరో సాయిధరమ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.