Begin typing your search above and press return to search.
శ్రీలంకన్ స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఎట్టకేలకు!
By: Tupaki Desk | 8 Oct 2020 2:00 PM GMTఇటీవలే తమిళ గ్రామీణ నాటకం `కా పే రణసింగం`లో అదరగొట్టారు విజయ్ సేతుపతి. మరోవైపు వైష్ణవ్ తేజ్ `ఉప్పెన`లోనూ విలన్ గా నటిస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. బన్ని.. చరణ్ .. మహేష్ .. ఎన్టీఆర్ లాంటి స్టార్లు సేతుపతికి కీలక పాత్రల్ని ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంత బిజీలోనూ అటు తమిళంలో అతడి హవా అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. తాజాగా శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో సేతుపతి నటించనున్నారని తెలుస్తోంది. 800 అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుండి సెట్స్ కి వెళ్తుంది.
ప్రాజెక్ట్ టీమ్ ని పరిచయం చేయడానికి గురువారం కొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సహకారంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు డార్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గత డిసెంబర్ లో అంతస్తుల్లోకి వెళ్లాల్సి ఉండగా.. రకరకాల కారణాల వల్ల ఇది వాయిదా పడింది.
ఈ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసిన సేతుపతి ఒక ప్రకటనలో ఏమన్నారంటే.. “ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నటించడం నాకు సంతోషంగా ఉంది. అతను తమిళ మూలాలున్న శ్రీలంకన్ క్రీడాకారుడు. ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి. మురళి పాత్రను పోషించడం నాకు సవాల్ లాంటిది. నేను సవాల్ స్వీకరించేందుకు ఎదురు చూస్తున్నాను. మురళి స్వయంగా ఈ ప్రాజెక్టుతో సన్నిహితంగా పాల్గొంటారని క్రికెట్ అంశాలపై నాకు మార్గనిర్దేశం చేస్తారని చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఇచ్చిన విశ్వాసానికి మురళికి.. నిర్మాతలకు కృతజ్ఞతలు” అని అన్నారు. ఈ చిత్రం తమిళంలో నిర్మితమై.. అనేక ఇతర భాషలలో విడుదల అవుతుంది. విజయ్ సేతుపతి ప్రస్తుతం శ్రుతి హాసన్ తో కలిసి ఎస్పీ జననాథన్ `లాభం` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అతను మరికొన్ని ప్రాజెక్టులతో పాటు అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా కూడా చేస్తున్నాడు.
ఇక ఇంతకుముందు రానా దగ్గుబాటి మొదట దాని సహ నిర్మాతగా ఈ చిత్రంలో భాగం కానున్నారని ప్రచారమైంది. తనను ఈ ప్రాజెక్టుతో అనుసంధానించడంపై ఆశ్చర్యపోయానని రానా ఒక ప్రకటనలో చెప్పాడు. తాజా సమాచారం ప్రకారం.. రానాకు ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదు.