Begin typing your search above and press return to search.
రియల్ హీరోః అన్నం పెట్టిన దర్శకుడు చనిపోతే.. విజయ్ సేతుపతి ఏం చేశాడంటే..?
By: Tupaki Desk | 16 March 2021 10:30 AM GMTఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏమంటే.. ‘తిన్నింటి వాసాలు లెక్కపెడ్డటం’. కానీ.. చేసిన మేలు మరిచిపోకుండా.. తమ గుండెల్లో శాశ్వత స్థానం కల్పించేవారు కూడా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు విజయ్ సేతుపతి! తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని, తిండిపెట్టిన దర్శకుడు ప్రాణాలు కోల్పోతే.. రియల్ హీరోగా ఏం చేయాలో అదంతా చేశాడు!
సౌత్ ఇండస్ట్రీలో ఇవాళ విజయ్ సేతుపతి హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవ్ నుంచి మొదలైన ప్రస్థానం.. దక్షిణాదిని చుట్టుముట్టి బాలీవుడ్ వరకు విస్తరించింది. అయినా కానీ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఉన్న అతికొద్ది మందిలో సేతుపతి ఒకరు. ఆయన నడక, నడతే ఇందుకు తిరుగులేని సాక్ష్యాలు.
అయితే.. ఇదంతా ఓవర్ నైట్ వచ్చిందేమీ కాదు. దీనివెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉంది. ఆకలికి అవస్థలు పడిన సందర్భాలు, కన్నీళ్లు దిగమించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలోనే కోలీవుడ్ లో సామాజిక బాధ్యతతో సినిమాలు తీసే దర్శకుడు ఎస్.పి.జననాథన్ సేతుపతిని ఆదుకున్నారు. కష్ట సమయంలో భోజనాలు కూడా పెట్టించాడు. అలాంటి దర్శకుడు.. ఈ నెల 14న బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయం తెలుసుకున్న సేతుపతి.. జననాథన్ చనిపోయిన ఆసుపత్రికి వెంటనే చేరుకున్నారు. ఆయన భౌతిక కాయాన్ని వాళ్ల ఇంటికి తెచ్చే వరకూ వెంటే ఉన్నారు. ఆ తర్వాత కూడా కన్నీళ్లతో అంతిమ యాత్రలో ఓ సాధారణ వ్యక్తిగా పాల్గొన్నారు. దహన సంస్కారాలు పూర్తిచేసే వరకూ అక్కడే ఉన్నారు. జీవితంలో సాయం చేసిన వారిని ఇలా చనిపోయిన తర్వాత కూడా గుర్తుంచుకోవడం నిజంగా గొప్ప విషయమని అందరూ కొనియాడుతున్నారు.