Begin typing your search above and press return to search.
అయ్యో.. మన విజయ్ హిందీ సినిమా వాయిదా
By: Tupaki Desk | 30 Oct 2022 1:30 PM GMTసౌత్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి హిందీలో మెర్రీ క్రిస్మస్ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ నటిస్తున్న విషయం తెల్సిందే. సౌత్ లో హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా ఇలా ఎన్నో పాత్రల్లో నటించిన విజయ్ సేతుపతి హిందీ లో ఎలా ఆకట్టుకుంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హిందీలో ఇప్పటికే విజయ్ కి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా తో ఈయన అక్కడ మంచి విజయాన్ని నమోదు చేయడం కన్ఫర్మ్ అన్నట్లుగా సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఈ సినిమాను 2022 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ తాజాగా సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
సినిమాను ఓటీటీ ద్వారా ఈ ఏడాది క్రిస్మస్ కే విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ విషయమై క్లారిటీ రాకుండానే సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయడం సాధ్యం అవ్వడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా మీడియా ద్వారా ప్రకటించారు.
అంధాధున్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సంజయ్ రౌత్రే మరియు రమేష్ తౌరానీ లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
హిందీలో విజయ్ సేతుపతికి ఇది భారీ చిత్రం అవ్వడం వల్ల ఆయన సౌత్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడటంతో అభిమానులు ఉసూరు మంటున్నారు.