Begin typing your search above and press return to search.
'మురళీధరన్ 800 ఏంటి ఇది?'
By: Tupaki Desk | 30 July 2019 5:47 AM GMTక్రీడాకారుల జీవితకథలతో తెరకెక్కించిన బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ తరహా బయోపిక్ ల హవా అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లదు. ఫిలింమేకర్స్ ఆ తరహా కథల వైపే మొగ్గు చూపిస్తున్నారు. 1986లో టీమిండియాని ప్రపంచకప్ విక్టరీ వైపు నడిపించిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పై `86` పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. నాటి ప్రపంచకప్ లో టీమిండియా సన్నివేశాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు.
దీంతో పాటే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో మరో బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. మురళీధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించనున్నారు. ఎం.ఎస్.శ్రీపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే రచయిత. స్పిన్ మాయాజాలంతో శ్రీలంక జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్ రికార్డు సృష్టించాడు. అతని బౌలింగ్ సరళిపై ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు అభ్యంతరాలతో వివాదాలు సృష్టించినా అతనికి శ్రీలంకన్ ప్రజలతో పాటు తమిళులంతా అండగా నిలిచారు. మురళీధరన్ పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ జరిగిందని ఇటీవల వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ బయోపిక్ కి 800 అనే టైటిల్ ని ఎంపిక చేశారని తమిళ ఫిలిం క్రిటిక్ రమేష్ బాలా వెల్లడించారు. తమిళంలో `మక్కల్ సెల్వన్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఈ బయోపిక్ లో నటించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ బయోపిక్ ని ప్రారంభించనున్నారు. కపిల్ బయోపిక్ కి 86 అనే సంఖ్యను ఎంపిక చేసినట్టే మురళీధరన్ బయోపిక్ కి 800 అనే సంఖ్యనే టైటిల్ గా ఎంపిక చేశారని ప్రచారమవుతోంది. అయితే టైటిల్ ని అధికారికంగా ప్రకటించి... దాని అర్థం ఏమిటో చిత్రయూనిట్ వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం సేతుపతి అభిమానులంతా అతడిని సౌతిండియన్ రణవీర్ సింగ్ అంటూ పొగిడేస్తున్నారు.