Begin typing your search above and press return to search.
మక్కల్ సెల్వన్ సినిమా రూ.20 కోట్లు రాబట్టేనా...?
By: Tupaki Desk | 7 Oct 2020 10:10 AM GMT'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి - ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''కా/పే.రణసింగమ్''. వీరుమాండి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కోటపాడి రాజేష్ నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కోడలు.. జీవీ ప్రకాష్ సిస్టర్ అయినటువంటి జీవీ భవానీ సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చింది. థియేటర్స్ మూతబడి ఉండటంతో ఈ సినిమాని ఇటీవలే ఓటీటీలో రిలీజ్ చేసారు. జీ ప్లెక్స్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో పే పర్ వ్యూ విధానంలో టికెట్ ధర రూ.199 తో స్ట్రీమింగ్ కి పెట్టారు. ప్రజా సమస్యలపై పోరాడే యువకుడు ఎదుర్కున్న సమస్యలు.. భర్త కోసం భార్య చేసే పోరాటం ఇతివృత్తంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే ఓటీటీ ఆడియన్స్ మరియు విశ్లేషకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో మొదటి రోజు ఈ సినిమాని 70 వేల మంది ఆన్లైన్ లో టికెట్ ధర చెల్లించి చూసారని తెలుస్తోంది. అంటే ఫస్ట్ డే ఈ సినిమాకి రూ 1.39 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అయితే సెకండ్ డే నుంచి వ్యూస్ బాగా తగ్గిపోయాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి కారణంగా పైరసీ సైట్స్ లో ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ అందుబాటులో ఉండటమే అని తెలుస్తోంది. రూ. 200 రేటు పెట్టి మొబైల్ లో సినిమా చూడటం కంటే పైరసీ డౌన్ లోడ్ చేసుకొని అందరూ చూడొచ్చని భావించడంతో 'కా/పే.రణసింగమ్' కలెక్షన్స్ పై ప్రభావం చూపించిందట. ఈ సినిమా కోసం జీ ప్లెక్స్ సుమారు 20 కోట్లకు డీల్ కుదుర్చుకుందని ఓటీటీ వర్గాల్లో అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా అన్ని వసూళ్లు రాబట్టడం కష్టమే అని చెప్పవచ్చు. అయితే తాజాగా 'కా/పే.రణసింగమ్' చిత్రాన్ని హిందీ - తెలుగు - కన్నడ - మలయాళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 9న జీ ప్లెక్స్ యాప్ లో స్ట్రీమింగ్ కి పెట్టనున్నారు. ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తుండటంతో ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.