Begin typing your search above and press return to search.
#AA20: వారికి ఆ పాత్రలు ఫిక్స్ చేసిన సుక్కు
By: Tupaki Desk | 9 March 2020 10:01 AM GMT'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ బాక్స్ ఆఫీస్ విజయం నమోదు చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. 'రంగస్థలం' తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ #AA20 కోసం పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేశారట. తాజాగా ఈ సినిమాలో నటీనటుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా కథ శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాసుగా ఉండే ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడట. హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుందట. ఇక తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఫారెస్ట్ ఇన్ స్పెక్టర్ పాత్రను పోషిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలకు జగపతి బాబును.. కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టిని ఎంచుకున్నారట. జేబీ ఎంత స్టైలిష్ గా ఉంటారో రాజ్ దీపక్ శెట్టి అంతే స్టైలిష్ గా ఉంటాడు. ఇక రాజ్ ఫిట్నెస్ చూస్తే టైగర్ ష్రాఫ్ లు.. హృతిక్ రోషన్లు గుర్తుకు రావాల్సిందే.
పాత్రల సంగతి ఇలా ఉంటే సుక్కు ఆస్థాన విద్వాంసుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. స్టైల్ విషయంలో ఇతర హీరోలకు అందనంత ఎత్తులో ఉండడంతో స్టైలిష్ స్టార్ అని బిరుదు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో మొదటిసారి ఊర మాసు పాత్రలో నటించడం అందరికీ ఓ సర్ ప్రైజ్. అంతే కాకుండా బన్నీ నాటు చిత్తూరు యాసలో మాట్లాడతాడనే అప్డేట్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.