Begin typing your search above and press return to search.

ఐటీ దాడులపై స్టార్ హీరో వివరణ

By:  Tupaki Desk   |   30 Sep 2018 8:59 AM GMT
ఐటీ దాడులపై స్టార్ హీరో వివరణ
X
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇంటిపై ఐటీ దాడులు చేశారనే వార్త మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. తమిళ ఇండస్ట్రీ మొత్తం దీనిపై దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. విజయ్ నటించిన ‘నవాబ్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగారనే విమర్శలు వచ్చాయి. దీనిపై తమిళనాట రచ్చ జరగడంతో ఎట్టకేలకు ఈ ఐటీ రైడ్ పై హీరో విజయ్ సేతుపతి వివరణ ఇచ్చాడు.

విజయ్ సేతుపతి తాజాగా నటించిన చిత్రం 96. నిర్మాత ఎస్ నందగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమకుమార్ దర్శకుడు. త్రిష హీరోయిన్. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని 5న విడుదల చేస్తున్నారు. దీంతో తాజాగా చిత్రం యూనిట్ చెన్నైలోని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి తన ఇంట్లో ఐటీదాడులు జరిగాయనే ప్రచారంపై వివరణ ఇచ్చారు. నిజానికి అవి దాడులు కావని.. కేవలం ఐటీ అధికారులు వచ్చి సర్వే చేశారని వివరించారు. ఆదాయపు పన్ను శాఖలో సర్వే ఒకటుంటుందనే విషయం తనకు అప్పుడే తెలిసిందన్నారు. తాను మూడేళ్లుగా ఇన్ కంటాక్స్ కడుతున్నానని.. అయితే రిటర్న్స్ మాత్రం దాఖలు చేయలేదని వివరించాడు. తన ఆడిటర్ సడన్ గా రిటర్స్స్ దాఖలు చేయడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు వచ్చి సర్వే చేసి వెళ్లారని వివరణ ఇచ్చారు. దీన్నే కొందరు రైడ్ అంటూ ప్రచారం చేశారని తెలిపారు. అసత్యాలు ప్రచారం చేయవద్దంటూ మీడియాకు, జనాలకు విజయ్ విజ్ఞప్తి చేశారు.