Begin typing your search above and press return to search.
కొత్త ఆఫర్లన్నింటికి నో చెబుతున్న సేతుపతి
By: Tupaki Desk | 23 Feb 2021 7:00 PM ISTతమిళంలో మాస్టర్.. తెలుగులో ఉప్పెన సినిమాతో అతి తక్కువ సమయంలో రెండు పెద్ద సక్సెస్ లను అందుకోవడంలో పాటు ఆ రెండు సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన నటుడు విజయ్ సేతుపతి. ఒక వైపు హీరోగా వరుసగా సినిమాల్లో హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రలను కూడా చేస్తూ వస్తున్నాడు. ఈ సమయంలోనే విజయ్ సేతుపతి కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. మాస్టర్ మరియు ఉప్పెన సినిమా ఎఫెక్ట్ తో పదుల సంఖ్యలో ఆయన వద్దకు ఆఫర్లు వస్తున్నాయి. కాని వాటన్నింటికి కూడా నో చెబుతున్నాడట.
విజయ్ సేతుపతి రాబోయే రెండు సంవత్సరాలకు గాను డైరీ ఫుల్ గా ఉందట. వరుసగా రెండు సంవత్సరాల పాటు సినిమాలు చేసేందుకు గత ఏడాదిలోనే ఆయన డేట్లు ఇచ్చేశాడు. దాంతో ఇప్పుడు కొత్తగా సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం లేదు. అందుకే వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను కూడా విజయ్ సేతుపతి రిజెక్ట్ చేయాల్సి వస్తుందట. చిన్న పాత్రను కూడా చేసేందుకు కొత్తగా ఒప్పుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది. ఆయన కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలంటే మరో ఏడాది పాటు మేకర్స్ వేయిట్ చేయాల్సిందే అంటూ తమిళ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు రెట్టింపు పారితోషికంను కూడా ఆఫర్ చేస్తున్నారట. కాని ముందుగా కమిట్ అయిన సినిమాల వల్ల విజయ్ సేతుపతి కొత్త వాటన్నింటికి కూడా నో చెబుతున్నట్లుగా తెలుస్తోంది.